అతి పెద్ద మద్దతుని జగన్ కోల్పోనున్నారా... ?

Satya
జగన్ అధికారంలోకి రావడానికి ఎన్నో శక్తులు పనిచేశాయి. జగన్ కి ముఖ్యంగా తండ్రి వైఎస్సార్ కి ఉన్న చరిష్మా కూడా బాగా కలసివచ్చింది. ఇక జగన్ కూడా తాను వైఎస్సార్ పాలన తెస్తాను అని చెప్పుకొచ్చారు. అది చాలా వర్గాల్లో కొత్త ఆశలను చిగురింపచేసింది.
అలా వైఎస్సార్ తో జగన్ని పోల్చుకున్న వారిలో అతి పెద్ద వర్గం అయిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు మొదటి నుంచి కాంగ్రెస్ పక్షానే ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల వేళ మాత్రం విభజన ఏపీకి చంద్రబాబు లాంటి అనుభవం కలిగిన నేత అవసరం అని భావించి ఆయన వెంట నడిచారు. అయితే నాడు కూడా ఆర్ధిక పరిస్థితులు అనుకూలించక చంద్రబాబు ఉద్యోగులకు కొన్ని  చేయలేకపోయారు.
ముఖ్యంగా నూతన పెన్షన్ విధానం విషయంలో బాబు తాను చేయలేనని చెప్పేసుకున్నారు. కానీ జగన్ పాదయాత్ర సందర్భంగా తాను వచ్చిన వెంటనే ఆ హామీ నెరవేరుస్తాను అని చెప్పారు. ఇక అనేక ఇతర హామీల మీద పూచీ నాదే అన్నారు. అయితే జగన్ రెండున్నరేళ్ల ఏలుబడిలో ఉద్యోగులకు అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదురు అయ్యాయని అంటున్నారు. పోఇగా కరోనా తరువాత వారికి జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి. దాంతోనే వ్యతిరేకత మొదలైంది. ఇక పీయార్సీ విషయంలో పెద్ద పేచీయే వచ్చిపడింది.
డీఏలు ప్రతీ ఆరు నెలలకు ఇవ్వాలి. అది కూడా లేదు, దాంతో తమ ఆర్ధిక ప్రయోజనాలకు వైసీపీ సర్కార్ గండి కొడుతోందని ఉద్యోగులు ఆగ్రహిస్తున్నారు. ఇపుడు వారు పోరాట బాట పడుతున్నారు. ఏపీలో ఉద్యోగ వర్గం అంటే పెద్ద శాతంగానే చూడాలి. వారి మద్దతు లేకపోతే కొన్ని పార్టీలు ఎలా అధికారంలోకి  దూరమయ్యాయో చరిత్ర చెబుతోంది. ఇపుడు వారే జగన్ కి దూరం అంటే రేపటి ఎన్నికల్లో పెను సవాల్ గానే చూడాలి. మరి ఉద్యోగుల మద్దతుని తిరిగి జగన్ సంపాదించుకునేందుకు ఏమి చేస్తారు అన్నదే ఇపుడు ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: