ఆవుని పెళ్లి చేసుకున్న మహిళ.. రోజు దాంతోనే?

praveen
ఇటీవలి కాలంలో కొంతమంది సాటి మనుషుల మీద చూపిస్తున్న ప్రేమ కంటే అటు జంతువుల మీద చూపిస్తున్న ప్రేమ ఎక్కువై పోతోంది. ముఖ్యంగా  కొంత మంది అయితే ఏకంగా పెంపుడు జంతువులను పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేస్తున్నారు. ఇటీవలే ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చి తన పెంపుడు కుక్క ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఇద్దరు మనుషులకు పెళ్ళి జరగడం ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. కానీ మనిషికి జంతువుకి వివాహం అంటే అది ప్రకృతి విరుద్ధమైనది. ఊహించనంత వెరైటీగా కూడా ఉంటుంది.

 ఇక్కడ ఇలాంటి ఒక విచిత్రమైన పెళ్లి సోషల్ మీడియాలో కెక్కింది. 74 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా ఒక ఆవును పెళ్లి చేసుకుంది. గ్రామస్తులు అందరి సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగడం గమనార్హం. కాంబోడియాలో వెలుగులోకి వచ్చింది ఈ చిత్రమైన ఘటన కంబోడియాలోని ఖత్రి ట్రావెల్స్ కు చెందిన కిమ్ హాంగ్ అనే 74 ఏళ్ల వృద్ధురాలు  జీవిస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని నెలల క్రితం న భర్త చనిపోయారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంది. కొన్ని ఆవులను కూడా పోషిస్తోంది. అయితే ఇటీవలే ఆ మహిళ తన పెంపుడు ఆవుపై ఉన్న ప్రేమతో ఏకంగా ఆవు ను పెళ్లి చేసుకుంది. ఈ ఆవు దూడ తమ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉందని అందుకే ఎంతో ప్రేమగా పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది సదరు మహిళ.

 అయితే ఈ ఆవు దూడ తనకు జంతువుల కనిపించడం లేదని చనిపోయిన తన భర్త లాగే కనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అందుకే ఆవు రూపంలో ఉన్న తన భర్తను మళ్లీ పెళ్లి చేసుకున్నాను అంటూ షాకింగ్ సమాధానం చెబుతుంది ఈ వృద్ధురాలు. అంతేకాదు ఇక అవును పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మహిళ ఏకంగా కుటుంబ సభ్యుల లాగ దానికి ఇంటిలో స్థానం కల్పించడం గమనార్హం. రోజు ఆవు తో పాటు నిద్ర పోతుంది ఇక ఆవు నిద్రపోవడానికి ఒక దిండును కూడా ఇస్తూ వస్తోంది వృద్ధురాలు.. అయితే తనకు ఉన్న ఇద్దరు పిల్లలకు కూడా ఈ ఆవు మీ తండ్రి అని చెప్పడంతో వాళ్లు కూడా నవ్వడం మొదలు పెట్టారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు మాత్రం వీళ్లకు  పిచ్చి పీక్స్ కు వెళ్ళింది అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: