`బీజేపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు`

Paloji Vinay
బిజెపిలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. క‌రీంగ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న‌ రెండు ప్రధాన ప్రతి పక్షాలు అభ్యర్థులను నిలబెట్టడం లేదని చెప్పాయ‌ని తెలిపారు. ఉమ్మ‌డి క‌రీంగ‌న‌ర్ జిల్లా ఎమ్మెల్సీ బ‌రిలో టిఆర్ఎస్‌ అభ్యర్థులుగా భాను ప్రసాద్, ఎల్ రమణ లు ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో బీజేపీ కీలక వ్యాఖ్య‌లు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నా... లేదా ఈటెల రాజేందర్ నా అర్థం కావట్లేద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఎమ్మెల్సీ స్థానంలో త‌మ పార్టీ పోటీ చేయట్లేదని బండి సంజయ్ అంటుంటే..  ఈటెల రాజేందర్ మాత్రం త‌మ అభ్య‌ర్థిని పోటీలో పెట్టామని అంటున్నారు అని తెలిపారు. ఈటెల రాజేందర్ పెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కలుస్తున్నాడ‌ని ఆరోపించారు. దమ్ముంటే పార్టీ ద్వారా కొట్లాడాలి... అని వ్యాఖ్యానించారు. ఎంపీ ఒక స్టేట్ మెంట్ ఎమ్మెల్యే మ‌రో స్టేట్ మెంట్ ఇస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు చెక్కు పెట్టాలని ఈటెల రాజేంద‌ర్ చూస్తున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ సునీల్ రావు.

 అలాగే.. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని అనుకుంటున్నానని అన్నారు. హుజురాబాద్ లో ఇలానే కుమ్మక్కు రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ ని అమ్ముకున్నారు అని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ  ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అమ్ముకుంటున్నారు అని తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. బండి సంజయ్ కు తెలియకుండా బీజేపీ కార్పొరేటర్లు ఈటెల రాజేంద‌ర్ పెట్టిన అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నార‌ని సునీల్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇలాంటి కుమ్మక్కుల పై బిజెపి, కాంగ్రెస్ పార్టీలు లు ఎలా చేస్తాయో చూడాలని అన్నారు.

టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని కుట్ర రాజకీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బిజెపి అధ్యక్షుడు కూడా మారే ఆవకాశం ఉందని తెలుస్తోంది అని జ్యోష్యం చెప్పారు. టిఆర్ఎస్ పతనం ప్రారంభం అయిందని రవిందర్ సింగ్ అన్నాడ‌ని.. కానీ, పతనం అయింది రవిందర్ సింగ్ నే అని అన్నారు. మేయర్ గా ఉండి 50 మంది కార్పొరేటర్లకే హెల్త్ కార్డులు ఇవ్వలే అని ఇక ఎంపిటిసి లకు ఏం ఇస్తావ్ అంటూ ర‌వీంద‌ర్ సింగ్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: