యూపీ రాజ‌కీయం : యోగికి అఖిలేష్ షాక్ ఇస్తాడా..?

Paloji Vinay
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తోంది. వివిధ సామాజిక వ‌ర్గాల‌ను ఆక‌ర్షించేందుకు ఆయా పార్టీలు దృష్టి పెట్టాయి. దేశంలో ఎక్కువ‌గా స్థానాలున్న రాష్ట్రంలో ఒంట‌రిగా బ‌రిలో దిగుతామ‌ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్ర‌క‌టించాయి. అవినితీకి ఆస్కారం లేకుండా జరిగిన పాల‌నే త‌మ‌ను మ‌రోసారి అధికారంలోకి తీసుకువ‌స్తుంద‌ని దీమా వ్య‌క్తం చేస్తోంది బీజేపీ. రైతుల ఆందోళ‌న త‌మ‌కు అనుకూలంగా ఉంటుంద‌ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా చురుగ్గా పాల్గొన్నారు. అయితే, తాజాగా రైతు చ‌ట్టాల ర‌ద్దుతో వారి వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.
   
   గ‌తంలో స‌మాజ్‌వాదీ పార్టీతో క‌లిసి పోటీ చేసినా కాంగ్రెస్‌కు ప్రయోగ‌జనం ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం.. ముందు నుంచే జ‌నంలో కలిసి పోతూ అవ‌కాశం వచ్చిన‌ప్పుడ‌ల్లా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు. అధికారంలోకి వ‌స్తామ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌కు న‌మ్మ‌కం లేక‌పోయినా.. కొన్ని స్థానాల‌యిన గెలిచుకుని త‌మ ఉనికి చాటుకోవాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోప‌క్క‌ స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత  అఖిలేష్ యాద‌వ్ ఈసారి కొత్త సాహ‌సం ప్ర‌య‌త్నిస్తున్నారు. తాను ఎల‌క్షన్స్‌లో పోటీ చేయ‌కుండా కేవ‌లం పార్టీని ముందుండి న‌డిపిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

 రాష్ట్రియ లోక్‌ద‌ళ్‌తో క‌లిసి పోటీ చేస్తామ‌ని అఖిలేష్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే బ‌హిరంగ‌స‌భ‌లు నిర్వ‌హిస్తున్న అఖిలేష్ ఈసారి త‌మ‌దే అధికారం అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. యాద‌వులు, ముస్లీం, వెనుక బ‌డిన త‌రగ‌తుల ఓట్లు త‌మ‌కే ప‌డుతాయ‌ని ఎస్పీ నేత‌లు ఆశిస్తున్నారు. బీజేపీ ప‌ట్ల ఆగ్ర‌హంగా ఉన్న బ్రాహ్మ‌ణులు త‌మ వైపు మొగ్గు చూపుతార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌లతో పోలిస్తే ఈ సారి స‌మాజ్‌వాదీ పార్టీ మెరుగైన స్థితిలో ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ స‌మాజ్ వాదీ పార్టీ, బీజేపీల మ‌ధ్యే ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నాయి. తాజాగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఎక్క‌వ‌వ‌డం, కేంద్రంపై గుర్రుగా ఉండ‌డం అఖిలేష్‌కు  కిల‌సి వ‌చ్చే అంశాలుగా చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: