రేవంత్ రెడ్డి:తెరాస నాయకులు గ్రామాలకు వస్తే రాళ్లతో కొట్టండి..!

MOHAN BABU
సుమారుగా 20 రోజులుగా రాష్ట్రంలో పండిస్తున్న వరి ధాన్యాన్ని ముఖ్యంగా యాసంగి పంట కు సంబంధించిన ధాన్యం కేంద్రము కొనుగోలు చేసేది తెలపాలని డిమాండ్ చేస్తూ తెరాస ప్రభుత్వం కేంద్రం పైన గుర్రు గా ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే పనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందున ప్రస్తుత వర్షాకాల పంటను ముందుగా కొనమని రాష్ట్ర బీజేపీ శ్రేణులు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించారు. దీనికి ప్రతిగా తెరాస కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలతో పాటు కేంద్రం మెడలు వంచి సాధించుతాం
 అని రాష్ట్ర ప్రభుత్వం ధర్నాచౌక్లో ధర్నా చేసింది.
       వరి ధాన్యం కొని మిల్లింగ్ ద్వారా బియ్యాన్ని ఎఫ్సిఐ గోదాములకు చేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది .అయితే కేంద్రం రియంబర్స్మెంట్ ద్వారా ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత చెల్లిస్తుంది.  తన బాధ్యతను మర్చిన రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన అనే  నెపంతో కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వ నిరసనలు, ధర్నాలు, అని నేడు ధర్నా చౌక్ లో జరిగిన "వరి దీక్ష" కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రెండు పార్టీలను ఘాటుగా విమర్శించారు.
       తక్షణ కర్తవ్యం ఏమిటి:
    వర్షాకాల పంట కొనుగోలు విషయంలో దాదాపుగా దసరా నుండి ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం లో తాత్సారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న వి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిగా కేటాయించి కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సహించ కపోగా ధర్నాలు నిరసనల పేరుతో కేంద్రం మెడలు వంచుతామని ప్రచారం చేసి ఢిల్లీకి పోయి కనీసం ప్రధానమంత్రి ,మంత్రులను కలవకుండా వ్యక్తిగత పనుల పై పోయి రావడాన్ని ఈ వరి దీక్ష కార్యక్రమంలో  వక్తలు ముఖ్యమంత్రి ధోరణిపై మండిపడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: