భారత్ పై చైనా ఏడుపు.. ఎందుకో మరీ?

praveen
గత కొంత కాలం నుంచి భారత్కు ఊహించని విధంగా వృద్ధి రేటు సాధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా అగ్రరాజ్యాలు చిన్నచూపు చుసిన భారత్ ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యాలకు పోటీ ఇచ్చే విధంగా మారిపోయింది. అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణిస్తూ దూసుకుపోతుంది భారత్. అయితే భారత్ ఎదుగుదలను చూసి పొరుగు దేశమైన చైనా కుళ్ళు బుద్దితో వ్యవహారిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్ ఎదుగుదలను ఆపేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కల్పించడం కారణంగా  భారత్ దృష్టి మొత్తం సరిహద్దు లోకి మరల్చి.. అభివృద్ధిని ఆపాలని ఇప్పటికే ప్రయత్నాలుచేసింది చైనా.

 అదే విధంగా  భారత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నో సార్లు ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పై చైనా చేసే ఆరోపణలు చిత్రవిచిత్రంగా ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు మరోసారి భారత్ పై ఏడవడం మొదలుపెట్టింది చైనా. సాధారణంగా సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది చైనా. ఇతర దేశాలకు చెందిన రక్షణ రంగం సహా వివిధ రంగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తస్కరించటం.. వాటికి డూప్లికేట్ వస్తువులను తయారు చేస్తూ ఉంటుంది.

ఇలా ఇప్పటికే ప్రపంచ దేశాలనుంచి ఎంతో కీలక సమాచారాన్ని కూడా దొంగిలించింది. ఏకంగా చైనా ఇలాంటి పనులు చేసేందుకు ఒక సైబర్ ఆర్మీని కూడా నడిపిస్తోంది. అలాంటి చైనా ఇప్పుడు భారత్పై చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారింది. భారత్ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. పవిత్రమైన ప్రాంతీయ సెక్యూరిటీ వ్యవస్థను నాశనం చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తుంది. భారత్ తీరును ప్రపంచ దేశాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ వేదికపై ఈ విషయం గురించి పోరాటం చేస్తాం అంటూ చైనా ఇచ్చిన స్టేట్మెంట్ కాస్త ప్రపంచ దేశాలనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: