మళ్లీ ఆంక్షలు తప్పవా...!

Podili Ravindranath
కరోనా వైరస్... దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచమంతా కూడా యుద్ధం చేస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్... ఆ తర్వాత సరిగ్గా మూడు నెలలకే ప్రపంచమంతా విస్తరించింది. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్ని ఆంక్షలు విధించాయి. భారత్ కూడా ఏకంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ విధించింది. చివరికి విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ఇక ఈ ఏడాది జనవరి నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే వంద కోట్లకు పైగా డోసులు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కరోనా సెంకటే వేవ్ మరోసారి ప్రపంచాన్ని కలవర పెట్టింది. ప్రాణవాయువు కొరత కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్న సమయంలో... ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ థర్డ్ వేవ్ తప్పదన్న అనుమానాలను బలపరుస్తోంది.
దక్షిణాఫ్రికాలో కలకలం రేపుతున్న ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రపంచ దేశారు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అన్ని దేశాలు కూడా దక్షిణాఫ్రికా నుంచి జరిపే ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీ తీయాలంటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం... అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఇక కరోనా కొత్త వేరియంట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓమిక్రాన్ వేరియంట్ పై అధికారులతో సమీక్ష చేశారు మోదీ. కొత్త వేరియంట్ భారత్‌లో ప్రవేశిస్తే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై చర్చించారు. అలాగే దీనికి సంబంధించిన వైద్యం, ఆసుపత్రుల్లో తీసుకునే జాగ్రత్తలపై ప్రధాని వివరాలు సేకరించారు. ఇక కొత్త వేరియంట్ భారత్‌లో ప్రవేశించకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించే విషయంపై కూడా ప్రధాని ఆరా తీశారు. తప్పని సరి అయితే.... ఆంక్షలు విధించేందుకు కూడా వెనుకాడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: