ఫ్యాన్ ఆంధ్రా : జూనియర్ నీ సేవలు మాకొద్దు!

RATNA KISHORE
ఒక‌నాడు తార‌క్ వ‌స్తే బాగుంటుంది
ఇప్పుడు తార‌క్ రాకుండా ఉంటేనే బాగుంటుంది
ఒక నాడు తార‌క్ ప్ర‌చారం పార్టీకి ప్ల‌స్
ఇప్పుడు తార‌క్ ప్ర‌స్తావ‌నే పార్టీకి మైన‌స్
తార‌క్.. వ‌ద్దు.. ఆయ‌న సేవ‌లు కూడా మాకొద్దు
అంటూ టీడీపీ కొత్త నినాదం ఒక‌టి వినిపించి
ప్ర‌జ‌ల‌లో సానుభూతి రాజ‌కీయాల‌ను స్థిరం
చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉంది.

ప్ర‌స్తుత ప‌రిణామాల రీత్యా ఆంధ్రావ‌నిలో తార‌క్ వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం అదే ప‌నిగా మాట్లాడుతోంది. పార్టీకి సేవ చేసేందుకు తాను ఎన్న‌డూ సిద్ధ‌మేనని తార‌క్ చెబుతున్నా కూడా ఎవ్వ‌రూ వినిపించుకోని విధంగా ఉన్నారు. త‌న ప‌రిధిలో తాను గ‌తంలోనూ ఇప్పుడూ పార్టీకి అండ‌గా ఉంటాన‌ని స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ తారక్ ను  అస్స‌లు క‌న్సిడ‌ర్ చేయ‌డం లేదు. దీంతో తార‌క్ కు, టీడీపీకి మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. మొన్న‌టి అసెంబ్లీలో నారా చంద్ర‌బాబు నాయుడిని, ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ప్ర‌స్తావిస్తూ చేసిన వ్యాఖ్య‌ల‌పై జూనియ‌ర్ ఇచ్చిన కౌంట‌ర్ చాలా వీక్ గా ఉంద‌ని, ఘాటుత‌నం అందులో లేద‌ని టీడీపీ అంటోంది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ మ‌రో దాడికి కూడా సిద్ధం అవుతోంది. అదేంటంటే ఇవాళ తార‌క్ హీరోగా నిల‌బ‌డేందుకు టీడీపీ ఎంత‌గానో సాయం చేసింద‌ని కానీ ఆయ‌న అవ‌న్నీ మ‌రిచిపోయి ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కొంద‌రు అంటున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌లో నిజం ఉందో లేదో కానీ తార‌క్ మాత్రం ఇప్పుడు ఒంట‌రి అయిపోయాడు.


భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి వైసీపీ చేసిన వ్యాఖ్య‌లు దానిపై ఖండ‌న ఇచ్చిన తీరు రెండూ కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. దీంతో ప‌లువురు తార‌క్ అభిమానులు సైతం తమ హీరో చెబుతున్న మాట‌లు అన్న‌వి ప్రత్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టించ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ ను టార్గెట్ గా చేసుకుని వ‌ర్ల రామయ్య కూడా చాలా ఘాటుగా స్పందించారు. దీంతో తార‌క్ టీడీపీతో తెగ‌దెంపులు చేసుకునేలానే ఉన్నారు. మొద‌ట నుంచి త‌మ‌కు నంద‌మూరి కుటుంబంలో ఆశించిన గౌర‌వం కానీ గుర్తింపు కానీ ద‌క్క‌డం లేద‌న్న ఆవేద‌న‌తోనో, బాధ‌తోనో ఉన్న ఎన్టీఆర్ కు తాజా ప‌రిణామాలు చేదు నిజాలే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: