ఫ్యాన్ ఆంధ్రా : సాక్షి మీడియాలో జ‌క్క‌న్న ఎంట్రీ ?

RATNA KISHORE
- జగన్ కు అండగా జక్కన్న యాడ్స్ కట్ చేస్తాడులే!
ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత బాగున్నా ఇప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో స్థితిగ‌తుల నేప‌థ్యంలో ఒడ్డెక్క‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని! ఆర్థికంగా ఈ సినిమా నిర్మాత‌ను సేఫ్ జోన్ లో ఉంచ‌దు గాక ఉంచ‌దు. క‌నుక ఓటీటీకి రిఫ‌ర్ చేస్తాడా అంటే అది కూడా లేదు. అలాంట‌ప్పుడు నిర్మాత‌తో పాటు సినిమా కొనుగోలు చేసిన వారికీ న్యాయం చేయాల్సిన బాధ్య‌త రాజ‌మౌళీదే! అందుకే ఆయ‌న తన‌దైన లాబీయింగ్ మొద‌లుపెట్టారు అని సమాచారం. జ‌గ‌న్ స‌ర్కారులో పెద్ద మ‌నుషుల‌తో ఓ ఒప్పందం కుదిరితే వ‌చ్చే  ఎన్నిక‌ల్లో రాజమౌళీ గ‌తంలో టీడీపీ స‌ర్కారుకు సాయం చేసిన విధంగానే సాంకేతిక సాయం అందించ‌వ‌చ్చు. ఇంకా కుదిరితే సాక్షి మీడియాకే కొన్ని వ‌ర్క్స్  చేసి పెట్ట‌వ‌చ్చు. ఇవ‌న్నీ ప్ర‌మోష‌న్ వ‌ర్క్సే అయి ఉంటాయి కూడా! ప్ర‌స్తుతానికి సాక్షి ఛానెల్ కు క్రియెటివ్ హెడ్ ఉన్న‌వారితోనే జ‌క్క‌న్న‌ను ముడిపెట్టి జ‌గ‌న్ ప‌నిచేయించుకునే ఛాన్స్ ఉంది. ఏమో గుర్రం ఎగ‌రావ‌చ్చు ! సాక్షి మీడియా లో రాజ‌మౌళీ ఎంట్రీ ఇవ్వ‌వొచ్చు కూడా!

 
ఆంధ్రావ‌నిలో సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్టాన్ని స‌వ‌ర‌ణ చేయాల‌నుకుని, అనుకున్న‌దే త‌డ‌వుగా, ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో మాట్లాడి అందుకు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ వేగ‌వంతంగానే పూర్తి చేశారు జ‌గ‌న్. ఇదే సంద‌ర్భంలో చిన్న నిర్మాత‌లు చాలా హ్యాపీ ఉన్నామ‌ని అంటున్నారు. అస‌లు ఉన్నారో లేదో కానీ పైకి మాత్రం ఆ మాట చెప్ప‌గ‌లుగుతున్నారు. అదంతా జ‌గ‌న్ మెప్పు కోస‌మే అన్న‌ది లోకానికే ఎరుక‌! అందుక‌నో ఎందుక‌నో చిన్న నిర్మాత‌లంతా క‌లిసి త్వ‌ర‌లో జ‌గ‌న్ కు స‌న్మానం చేయ‌నున్నార‌ని స‌మాచారం. స‌న్మానం కాక‌పోయినా అంత‌టి స్థాయిలో హ‌డావుడి అన్న‌ది జ‌గ‌న్ కు న‌చ్చ‌క‌పోయినా క‌నీసం క‌లిసి థాంక్స్ అయినా చెప్పేద్దామ‌ని అనుకుంటున్నారు.


 మ‌రి! ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఓ వ‌ర్గం జ‌గ‌న్ కు అనుకూలంగా ఉంది. దీంతో వారిని అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ తాను చేద్దామ‌నుకున్న‌దంతా చేసేసి ఆఖ‌రికి నెపం ఇండ‌స్ట్రీలో కొంద‌రు పెద్ద‌లు అంటూ వారి మీద నెడుతున్నారు. నెట్ట‌బోతున్నారు కూడా! ఇంకా చెప్పాలంటే  చిల్ల‌ర కల్యాణ్ లాంటి నిర్మాత‌లు ఎలానూ జ‌గ‌న్ వ‌ర్గంగా పేరు తెచ్చుకున్నారు. వారే ఇప్పుడు జ‌గ‌న్ ప‌క్షం వ‌హించ‌నున్నారు. న‌ట్టి కుమార్ లాంటి వివాదాస్ప‌ద నిర్మాత‌లు, తుమ్మ‌లప‌ల్లి రామ స‌త్య‌నారాయ‌ణ లాంటి చిన్న నిర్మాత‌లు జ‌గ‌న్ కు అండ‌గా ఉంటూ, ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ‌త్తాసు ప‌ల‌క‌నున్నారు. ఎలానూ వీళ్ల‌వి చిన్న సినిమాలే క‌నుక టికెట్ రేటు లో మార్పు అన్న‌ది వీరిపై పెద్ద‌గా ప్ర‌భావం చూప‌దు. అలానే ఏపీలో మినీ థియేట‌ర్ల నిర్మాణానికి త‌న‌వంతు సాయం ఎప్పుడూ ఉంటుంద‌ని జ‌గ‌న్ చెప్ప‌డంతో, కొందరు జ‌గ‌న్ వ‌ర్గంకు చెందిన నిర్మాత‌లు వైజాగ్ దిశ‌గా అడుగులు వేసి సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా త‌క్కువ సిట్టింగ్ కెపాసిటీ ఉండేలా థియేట‌ర్లు నిర్మించనున్నారు.
ఈ ద‌శ‌లో రాజ‌మౌళీలాంటి పెద్ద పెద్ద ద‌ర్శ‌కులంతా డైలమాలో ప‌డిపోయారు. హీరోల‌కు స‌మానంగా తానూ రాణిస్తూ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ చాటుతున్న రాజ‌మౌళీ ఇక‌పై భారీ బ‌డ్జెట్ చిత్రాల‌పై మ‌మ‌కారం వ‌దులుకోవ‌చ్చు. లేదా ఏపీ స‌ర్కారుకు త‌న‌వంతుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజువ‌ల్ ప్ర‌మోష‌న్ వ‌ర్క్స్ ఏమ‌యినా చేసి ఇవ్వ‌వ‌చ్చు. ఆ విధంగానో ఏ విధంగానో స్వామి భ‌క్తి చాటుకుంటేనే రాజ‌మౌళి లాంటి పెద్ద ద‌ర్శ‌కులు ఈ ప్ర‌భుత్వంలో అంతో ఇంతో రాణించేందుకు అవ‌కాశాలున్నాయి. లేదంటే ఇవాళ పెద్ద సినిమా
బ‌తికేందుకు ఛాన్సే లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: