వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేలు నిజ‌మా...!

VUYYURU SUBHASH
ఏపీలో అధికార వైసీపీ వర్సెస్ విపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల అసెంబ్లీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ర‌గిలిపోతున్నాయి. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు సైతం తన కుటుంబాన్ని కించపరిచారని ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకుని బోరున విలపించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు.
చంద్రబాబు ను విమర్శించిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి అసెంబ్లీలోకి రాకుండా చేస్తామని కూడా టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు ముందుగానే వైసీపీ పై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని .. వైసీపీలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలోకి వస్తారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీకి చెందిన పది మంది ఎమ్మెల్యేల వరకూ తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని కూడా టిడిపి వాళ్ళు చెబుతున్నారు.
జ‌గ‌న్ తీరుతో వారంతా విసిగి పోయి ఉన్నార‌ని.. చాలా మంది త‌మ బాధ ల‌ను ప‌ర్స‌న‌ల్ గా త‌మ తో షేర్ చేసుకుంటున్నార‌ని టీడీపీ నేత‌లు చెపుతున్నారు. అయితే వైసీపీ లో వాస్త వ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. చాలా మంది ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ అపాయింట్ కూడా ఇవ్వ‌డం లేదు. అయితే ఇది టిడిపి నేతల‌ మైండ్ గేమ్ లో భాగమా లేదా ? జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు నిజంగా టిడిపి నేతలతో ట‌చ్ లో ఉంటున్నారా ? అన్నది మాత్రం ఎన్నికల ముందు తేలిపోనుంది.
గ‌త టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా చివ‌రి ఐదారు నెల‌ల్లో టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క నేత‌లు వైసీపీ లోకి వెళ్లి పోయారు. మ‌రి రేపు ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: