అదే 2024లో కొడాలి నాని ఓడిపోతాడా...!

VUYYURU SUBHASH
కొడాలి నాని ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో టాప్ ఫైర్ బ్రాండ్ లీడర్ గా మారిపోయారు. విచిత్రమేంటంటే చంద్రబాబు శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి... ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న నాని ఇప్పుడు అదే చంద్రబాబుకు రంకుమొగుడు అయిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సు చేయ‌డంతోనే చంద్రబాబు రెండు సార్లు నానికి టిక్కెట్ ఇవ్వడంతోనే.. నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అదే చంద్రబాబు 2004 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ మాట వినకుండా ఉండి... సిట్టింగ్ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కే సీటు ఇచ్చి ఉంటే ఇప్పుడు కొడాలి నాని ఎక్కడ ఉండేవారో ఆయనకే తెలియదు.

రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని నాని... ఎన్టీఆర్ సిఫార్సు తోనే టిక్కెట్ దక్కించుకుని టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే నాని వైసీపీలోకి వెళ్లి ఇప్పుడు చంద్రబాబు కి చెమటలు పట్టిస్తున్నారు. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబును తిట్టించేందుకు అదే వర్గానికి చెందిన నానిని వైసీపీ వాళ్లు బాగా వాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే గుడివాడ ఓమ‌టి లేకుండా వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్న‌ నానిని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు క‌సితో ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఒక ఈక్వేష‌న్‌ ప్రకారం అక్కడ నానిని ఓడించేందుకు టిడిపి పావులు కదుపుతోంది. గుడివాడ లో కమ్మ సామాజిక వర్గం ఓట‌ర్లు ఎక్కువ ఎక్కువ ఉన్నారు.

అయితే చంద్రబాబు పై నాని బూతుల‌తో విరుచుకుపడడంతో ఈసారి గుడివాడ క‌మ్మ‌ల్లో మార్పు కనిపిస్తోంది. ఇక కాపులు ఎలాగూ ప‌వ‌న్‌కు స‌పోర్ట్‌గా ఉంటారు. పైగా నాని పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్ర విమర్శలు చేయడంతో ఈసారి గుడివాడ కాపులు కూడా నానిపై ర‌గులుతున్నారు. రేపటి ఎన్నికల్లో టిడిపి జనసేన పొత్తు ఉండి.. టిడిపి అభ్యర్థిగా వంగవీటి రాధా పోటీ చేస్తే గుడివాడ లో ఉన్న కమ్మ + కాపు సామాజిక వర్గం యూటర్న్ తీసుకుంటుంద‌ని.. అప్పుడు నానికి ఖ‌చ్చితంగా ఓట‌మి రుచి చూపిస్తుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: