అభివృద్దే కాదు.. పేదరికం కూడా ఒక్కచోటేనా..!

Chandrasekhar Reddy
దేశంలో అభివృద్ధి చాలా సార్లు ఒక్కచోటే కేంద్రీకృతం అయ్యేట్టుగా జరిగింది. దానితో మిగిలిన ప్రాంతాలు వెనకనే ఉండిపోయాయి. దానికి కారణం కూడా కొత్తదేమీ కాదు, స్వార్ధ రాజకీయనేతలు ఉన్నంత కాలం, అభివృద్ధి అనేది ప్రజల కోసం కాకుండా ఏవేవో సంస్థల కోసం మరియు నేతల కోసం మాత్రమే జరుగుతుంది. వాళ్ళ కన్ను ఎక్కడ పడితే అక్కడ అన్ని సంస్థలు వస్తాయి, దానివెనుక అభివృద్ధి జరిగిపోతూనే ఉంటుంది. చరిత్ర చుస్తే ఇదే అర్ధం అవుతుంది. ఏనాడూ అభివృద్ధి కింద ఒక్క రాజకీయ నేతదో  లేక ఒక ఉన్నత సంస్థ దో లేక ఒక ప్రముఖుడిదో స్థలం పోయినట్టు ఇన్నేళ్ల చరిత్రలో లేనేలేదు. ఎప్పుడు ఉన్న కాస్త భూమిని నమ్ముకున్న పేదోడి భూమి మాత్రమే ఈ అభివృద్ధి పనులకు పనికి వచ్చింది. అదే అధికారులకు కూడా సరైనదిగా కనిపిస్తుంది, అదే లాక్కుంటారు, మరీ కాదంటే కాస్తోకూస్తో బిక్ష వేసినట్టు పారేసి, అభివృద్ధి చేశాం అంటారు.
అవును ఇది ప్రజాస్వామ్యదేశం కదా, అంటే ప్రజలే దేవుళ్ళు. వాళ్ళ కోసం అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇతర స్థలాలను వాడాలి కానీ దేవుడి స్థలాలను లాక్కుంటున్నారేమిటో? అయితే ఇది ప్రజాస్వామ్యం కాకపోయుండాలి లేదా అది పేరుకు మాత్రమే తప్ప నిజంగా లేకపోయి ఉండాలి, బహుశా అదే అయ్యి ఉంటుంది. అందుకే అభివృద్ధి ఒక్కచోటే ఉంటుంది. అలాగే పేదరికం కూడా ఒక్కచోటకు చేరిపోతుంది. తాజా నీతి ఆయోగ్ కూడా అదే తేల్చిని. కాకపోతే వాళ్ళు ఇంత బాహాటంగా చెప్పలేక, వాళ్ళ పరిధిలో చెప్పారు. నీతి ఆయోగ్ కూడా ప్రభుత్వం చెప్పినట్టు, వాళ్లకు అనుకూలంగానే ఈ నివేదికలు ఇవ్వడం జరుగుతుందేమో ఎవరికి ఎరుక, న్యాయస్థానాలనే నేతలు శాసిస్తున్నారు కాబట్టి నీతి ఆయోగ్ పెద్ద విషయమా అని అనుకోవాల్సి వస్తుంది.  
ఈ నివేదికలో ఒక రాష్ట్రంలో పేదరికం 50 శాతం పైనే ఉందని చెప్పారు. రాష్ట్రంలో 50 శాతం అంటే అక్కడ పరిస్థితి ఊహించవచ్చు. 75 ఏళ్ళ భారతం ఇంత గొప్పగా తీర్చిదిద్దిన ఘనత మన నేతలకే దక్కింది. ఈ సందర్భంలో వాళ్ళను తలుచుకొని తీరాలి కాబోలు. ఇంకేమైనా అంటే ఎక్కువ జనాభా ఉన్న దేశం అని చెప్పేస్తారు. ఎక్కువ మానవ వనరులు ఉన్నాయని మాత్రం ఒప్పుకోలేరు. వాటిని ఉపయోగించుకోవడంలో ఏ ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోయింది. ఉన్న వనరులను తగిన రీతిలో ఉపయోగించుకోవడం, నిర్వహించడం అనేవే కదా నేతల బాధ్యత, అవే సరిగా చేయలేనప్పుడు ఇక వాళ్ళు చేసేవి ఏముంటాయి, దండుకోవడం తప్ప. అదే మనవాళ్లకు బాగా తెలిసిన విద్య. దాని పరియవశానమే ఈ సూచిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: