కరోనా కల్లోలం.. అమ్మో..! ఒకే కాలేజీలో 182మందికా..?

NAGARJUNA NAKKA
కర్ణాటక రాష్ట్రంలోని ధర్వాద్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎస్ డీఎమ్ కళాశాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 182కు పెరిగింది. గురువారం 300మందికి టెస్టులు చేయగా.. 66మందికి వైరస్ సోకింది. ఈ రోజు మరికొందరికి టెస్టులు చేశారు. ఈ నెల 17నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీనే కొంపముంచినట్టు అధికారులు గుర్తించారు. అయితే కరోనా సోకిన వారిలో ఎక్కువ మందికి ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తవ్వడం విశేషం. \
ఇక దేశవ్యాప్తంగా గత 24గంటల్లో 11లక్షల 81వేల 246మందికి కరోనా టెస్టులు చేయగా.. 10వేల 549పాజిటివ్ కేసులొచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 488మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 3.45కోట్లకు చేరగా ఇప్పటి వరకు 4లక్షల 67వేల 468మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో లక్షా 10వేల 133యాక్టివ్ కేసులున్నాయి.
భారత్, పాక్, బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్, ఇండోనేషియా దేశాల పౌరులపై ఉన్న ప్రవేశ ఆంక్షలను సౌదీ అరేబియా తొలగించింది. పూర్తి వ్యాక్సినేషన్ జరిగిన ఈ దేశాల పౌరులు డిసెంబర్ 1నుంచి సౌదీ అరేబియాలోకి ప్రవేశించాలనుకుంటే 14రోజుల క్వారంటైన్ లేకుండానే రావొచ్చు. అయితే తాము ఆరోగ్యంగా ఉన్నామనీ నిర్ధారించేలా ఐదు రోజులు నిర్బంధంలో ఉండాలని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ పై అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ లోపు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నఆయన.. ఇంటింటికీ సర్వే ద్వారా వ్యాక్సినేషన్ జరపాలన్నారు. గర్భిణీలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హరీశ్.. విద్యా సంస్థలు, హాస్టళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో స్పెషల్ డ్రైవ్ చేయాలన్నారు. ఇప్పటి వరకు 3.60కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశామన్నారు.

కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ లు అందించడమే కాదు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేస్తోంది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: