బ్రిటన్-ఫ్రెంచ్ మధ్య.. వలసవాదుల చిచ్చు..!

Chandrasekhar Reddy
ప్రపంచంలో వలసవాదుల సమస్య పెరిగిపోయింది. ఉద్యోగమనో వ్యాపారం అనో కొందరు బ్రతుకును వెతుక్కుంటూ ఇతర దేశాలకు వెళ్లడం సహజం. కొందరు వేరే వేరే కారణాలకు కూడా వెళ్తుండొచ్చుగాక. కరోనా ముందు నుండి కూడా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. అందుకే గత అమెరికా అధ్యక్షుడు కూడా వలసవాదుల పట్ల కఠినంగానే ఉన్నారు. సాధారణంగా చట్ట బద్దంగా వలసవాదులు ఆయా దేశాలకు వెళ్తుండటం పరవాలేదు, కానీ చట్ట వ్యతిరేక మార్గాల ద్వారా కూడా చాలా మంది ఆయా దేశాల బాట పడుతున్నారు. సమస్య అల్లా వీళ్లతోనే, పొమ్మంటే ఒకబాధ, ఉండమంటే ఒక రచ్చ అన్నట్టే ఉంటుంది ఇలాంటి వారితో. భారత్ కూడా బెంగాల్ లో ఇదే తరహా సమస్యను చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఒక్క రాష్ట్రమే కాదు, ప్రతి చోట ఈ సమస్య ఉండొచ్చు, కానీ దానిపై చర్యలకు ఉపక్రమించినప్పుడు, దానిని కూడా రాజకీయాలకు వాడుకుంటూ కొందరు దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు.
ఇక ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో ఉన్న సమస్య కూడా ఈ వలసలకు ప్రధాన కారణం. ఉదాహరణకు ఆఫ్ఘన్ లాంటి దేశాలలో బ్రతకలేక పొరుగు దేశాలకు కనాకష్టం మీద పారిపోవాల్సి రావచ్చు. అలాంటి వారిని స్వాగతించడానికి కూడా ప్రస్తుతం ఎవరికి మనసు రావడం లేదు. అందుకు కూడా కారణం లేకపోలేదు. ఇలా సరిహద్దులు దాటేస్తున్న వాళ్లలో తీవ్రవాదులు కూడా ఉంటున్నారు. వీళ్లు వలసవాదుల పేరుతో ఆయా దేశాలలో స్లీపర్ సెల్స్ గా స్థిరపడిపోతున్నారు. సమయం వచ్చినప్పుడు దాడులకు సిద్దపడుతున్నారు. ఇలాంటివి అనుభవంలోకి వచ్చినప్పటి నుండి ఆయా దేశాలు వలస వాదుల విషయంలో బాగా కఠినంగా ఉండక తప్పటం లేదు. స్లీపర్ సెల్స్ కూడా సాధారణ పౌరుల మాదిరే ఉంటారు, వీళ్లు ప్రజలలో కలిసిపోయి బ్రతికేస్తారు. అందుకే వాళ్ళను గుర్తించడం చాలా కష్టం.
ఈ సమస్య ఉన్నందున, అంతర్జాతీయ సమాజం వలస వాదులను తమ తమ దేశాలలోకి రానీయడానికి సంసిద్ధంగా లేదు. జాలిపడి రానిస్తే, రేపు ఏదైనా అనుకోని ఘటన జరిగితే అది ప్రభుత్వానికి చుట్టుకుంటుంది. అందుకే ఆయా ప్రభుత్వాలు జాగర్త వహించడం జరుగుతుంది. తాజాగా బ్రిటిష్-ఫ్రాన్స్ మధ్య కూడా ఇదే తరహా సమస్య నెలకొంది. కొందరు వలసవాదులు సరిహద్దులు దాటటంతో రెండు దేశాల సైన్యం కాల్పులకు దిగారు. అందులో కొందరు వలసవాదులు మృతి చెందారు. దీనితో నీ  తప్పంటే నీ తప్పు అంటూ రెండు దేశాలు నిందించుకుంటున్నాయి. ప్రపంచపటంలో ఒక తీవ్రవాద దేశం తయారయ్యాక ఇలాంటి చొరబాట్లు సహజం, అందుకే ఈ మధ్య వలసవాదుల పట్ల మరింత జాగురూకతతో ఉంటున్నాయి ఆయా దేశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: