మొన్న అలీబాబా అధ్యక్షుడు.. నేడు జేపీ మోర్గాన్ ప్రతినిధి వంతు..!

Chandrasekhar Reddy
చైనా రానురాను తీవ్రంగా ప్రవర్తిస్తుంది. అక్కడ ప్రభుత్వ పెద్దలకు ఎవరు ఎదురుతిరిగినా లేదా వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడినా తీవ్రంగా చర్యలు తీసుకుంటున్న విధానం తెలిసిందే. గతంలో అలీబాబా సంస్థ యజమాని కూడా ప్రభుత్వం పై విమర్శలు చేసినందుకు మాయం చేసింది చైనా. ఆ అపవాదు రాగానే మళ్ళీ కొన్నాళ్ళకు ఒక్కసారి మీడియా కు చూపించింది, అనంతరం ఇప్పటివరకు ఆయన జాడ కనిపించలేదు. అలాగే ఇటీవల టెన్నిస్ క్రీడాకారిణి తనపై ప్రభుత్వ ప్రతినిధి లైంగిక వేధింపులు చేసినట్టు పిర్యాదు చేయగానే, ఆమెను మాయం చేశారు. ఈ సందర్భంలో కూడా అందరు ఆమె కనిపించడం లేదని చైనాను తీవ్రంగా విమర్శించిన తరువాత కాసేపు ఆమెను కూడా మీడియా ముందుకు తెచ్చి చూపించి సరిపెట్టింది. ఆమె మళ్ళీ కనిపించలేదు.
ఇలా చైనా తన ప్రభుత్వాన్ని ఎవరైనా వేలెత్తి చూపిస్తే వాళ్ళను మాయం చేస్తుంది. జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తే ఒక్కసారి వాళ్ళను తెరపైకి తెచ్చి మళ్ళీ మాయం చేస్తూనే ఉంది. ఇలా చేస్తూ చైనా అంతర్జాతీయ సమాజంలో తన గొయ్యి తాను తవ్వుకుంటుంది. తాజాగా చైనా లో ఎక్కువ పెట్టుబడులు పెట్టిన జేపీ మోర్గాన్ ప్రతినిధి కూడా సంస్థ బాగా పాతబడింది, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నోరు మెదిపారు. అయితే ఇది ఆయన కు చేటు చేస్తుందా అనేది ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా చూస్తుంది. అలీబాబా లేదా టెన్నిస్ క్రీడాకారిణి మాదిరే ఈయన కూడా కనిపించకుండా పోతారేమో అనే చర్చ జరుగుతుంది.
దాష్టికాలకు మారుపేరుగా ఒకప్పుడు పాక్ చెప్పుకుంటాం, కానీ కరోనా అనంతరం ఆ స్థానంలోకి చైనా వచ్చినట్టుగా ఉంది. అన్ని ప్రపంచానికి విరుద్ధంగానే చేస్తూపోతుంది. కనీసం ఇతర దేశాలు ఏమని అనుకుంటాయనే ఆలోచన లేకుండా తోచింది చేస్తుంది అక్కడ ప్రభుత్వం. పేరుకేమో మానవ హక్కులు కాపాడే వ్యవస్థగా అతిపెద్ద కమ్మూనిస్టు ప్రభుత్వం. చేతలలో మాత్రం కనీసం ఆ దేశంలోనే ఎవరికి కనీస హక్కులు లేకపోవడం. ఇదెక్కడ చోద్యమో మరి. అక్కడ వారికి ముందు స్వాతంత్రం లభించాలని ప్రార్ధించాల్సి ఉంది. లోకంలో ఇంకా హిట్లర్ కంటే గొప్పవాళ్ళు ఉన్నారని ఇలాంటి దేశాధినేతలను చూస్తుంటే స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: