సిబిఐ విచారణ ను ఎదుర్కోనున్న న్యాయమూర్తి ?

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సిబిఐ)  శుక్రవారం ఒక ఘనతను సాధించినట్లుయింది.  ఓ విశ్రాంత న్యాయమూర్తిని విచారణ చేసేందుకు అనుమతులు సాధించింది.  ఈ కేసు ఒక విధంగా సిబీఐకి ఒక ఛాలెంజ్ లాంటి దని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉన్నత న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం. అలహాబాద్ హై కోర్టులో న్యాయమూర్తి గా పని చేసిన  నారాయణ్ శుక్లా అవినీతికి పాల్పడ్డారని పేర్కోంటూ సిబిఐ అలహాబాద్ హై కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.  అతనిని విచారణ చేసేందుకు అనుమతులు కోరింది. చాలా వాదోప వాదాల తరువాత  న్యాయమూర్తిని విచారణ చేయాలని అలహాబాద్  హైకోర్టు శుక్రవారం సిబిఐకి  అనుమతితో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.
లక్నోలోని మెడికల్ కాలేజీకి అనుకూలమైన ఉత్తర్వు ఇచ్చారని ఆరోపణలు చేస్తూ  2019 డిసెంబర్ 4న అలహాబాద్ హైకోర్టు సి.బి.ఐ. పిటీషన్ దాఖలు చేసింది. నాటి సిట్టింగ్ జడ్జి శ్రీ నారాయణ్ శుక్లాతో పాటు ఐ.ఎం.ఖుద్దూసీ, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు మరో నలుగురిపై సీబీఐ అవినీతి  పై పిటీషన్ వేసింది. న్యాయమూర్తులను విచారణ చేసేందుకు అనుమతి కోరింది. అంతకు మందే నారాయణ్ శుక్లా పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సుప్రీం కోర్టు కూడా జస్టిస్ శుక్లా దుష్ప్రవర్తనపై  అంతర్గత విచారణ జరిపింది. అంతే కాదు ఆ నివేదికను బహిర్గతం చేసింది. ఇందంతా కూడా  నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  దీపక్ మిశ్రా హయాంలో జరిగింది.  నివేదిక అందిన వెంటనే  నారాయణ్ శుక్లాను అభిశంసించాలని  దీపక్ మిశ్రా సిఫారసు చేశారు. జస్టిస్ మిశ్రా  పదవీ కాలం పూర్తవడంతో ఆయన సుప్రీం కోర్టు సిజే పదవి నుంచి వైదొలిగారు. ఆ తరువాత  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ రంజన్ గగోయ్ బాధ్యతలు స్వీకరించారు. అయితే రంజన్ గగోయ్  జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన సిఫారసులను అమలు చేయలేదు. కాగా జస్టిస్ ఎస్ఎన్ శుక్లా జూలై 2020లో పదవీ విరమణ చేశారు.
సిబిఐ మాత్రం జస్టిన్ నారాయణ్ శుక్లా పై అరోపణలను వెనక్కి తీసుకో లేదు.  కోర్టుకు ఆయనను విచారణ చేయాల్సిందే నని పదే పదే కోరింది. ఇందుకు సంబంధించిన  పలు పత్రాలను సమర్పించింది.  అలహాబాద్ హై కోర్టు శుక్రవారం సిబిఐకి అనుమతులతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: