వైసీపీ నేత‌ల‌కు భ‌ద్ర‌త పెంపు వెనుక వ్యూహం ఏంటి..?

Paloji Vinay
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో విప‌క్ష నేత చంద్ర‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ వైసీపీ మంత్రి కొడాలి నాని మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని నిఘావ‌ర్గాలు హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్టు తెలుస్తోంది. దీంతో వీరికి భ‌ద్ర‌త పెంచుతూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లపై తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అయితే, ఈ న‌లుగురు పై టీడీపీ సానుభూతి ప‌రులు దాడి చేయ‌చ్చ‌నే స‌మాచ‌రంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.

దీంతో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబ‌టి రాంబాబు, వ‌ల్ల‌భ‌నేని వంశీ, కాకినాడ ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ల‌కు భ‌ద్ర‌త పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారి చేసింది. దీంతో ఈ వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. వైసీపీ మంత్రి కొడాలి నానికి ప్ర‌స్తుతం క‌ల్పిస్తున్న భద్ర‌త‌తో పాటు అద‌నంగా మ‌రి కొంద‌రిని చేర్చుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల‌కు కూడా ఇదే విధంగా భ‌ద్ర‌త పెంచిన‌ట్టు స‌మాచారం. వీరంద‌రికి ప్రాణహాని ఉన్నద‌ని ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

    అయితే, ప్రస్తుతం రాజ‌కీయాలు మారిపోయాయ‌ని.. ప‌ట్టాభి ఎపిసోడ్‌తో భౌతిక దాడులకు పాల్ప‌డుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. బాబు ఏడ్వ‌డంతో టీడీపీ, బాబు అభిమానులు వైసీపీ నేత‌ల‌పై గుర్రుగా ఉన్నారు. దీంతో పాటు వీళ్ల‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షం హెచ్చ‌రిక‌లు జారీ చేస్తే అధికార ప‌క్షం భ‌య‌ప‌డిన సంద‌ర్భాలు లేవు అలాంటిది వారికి ఇప్పుడు భ‌ద్ర‌త పెంచ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. అలాగే ప్ర‌భుత్వం తాజాగా నిర్ణ‌యంతో ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. నిజంగా ఈ వ్య‌వ‌హారంలో ఈ నలుగురు భ‌య‌ప‌డ్డారా..?  లేదా చంద్ర‌బాబుకు సింప‌తి పెరుగుతుంద‌ని గుర్తించి తామే బాధితుల‌మ‌ని చెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా అనే ప్రశ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. లేదా ఈ నిర్ణ‌యం వెనుక ఈ ఇత‌ర వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: