శభాష్ చంద్రబాబు.. గుడిసెల్లోకి వెళ్లీ మరీ..?

Chakravarthi Kalyan
నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అక్కడి గాంధీ గిరిజన కాలనీలో దెబ్బ తిన్న ఇళ్ళను చంద్రబాబు పరిశీలించారు. దీంతో బాధితులు చంద్రబాబు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. ఇటీవల జరిగిన నగర పాలిక ఎన్నికల్లో ఓటుకు రూ. 10వేలు ఇచ్చిన వైకాపా నాయకులు, వరదలతో సర్వం కోల్పోతే రూ.2వేల తో సరిపెట్టారని అక్కడి జనం వాపోతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం రూ.10పది వేల ఖర్చు పెట్టి.. ఇప్పుడు మా ప్రాణాలకు రూ.2వేలు ఖరీదు కట్టారని అక్కడి బాధితులు వాపోయారు.

ఇన్నేళ్ల కాలంలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ చూడలేదని చెప్పిన వరద బాధితులు.. మా వీధిలో తెలుగుదేశం సానుభూతి పరులున్నారని కనీస సాయం కూడా ఇవ్వలేదని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. వరదల్లో మునిగిపోతున్నా ఇన్ని రోజులూ ఏ మాత్రం పట్టించుకోలేదని.. ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారని కాలనీని శుభ్రం చేశారని వారు తెలిపారు. గాంధీ కాలనీలో కలియ తిరిగిన చంద్రబాబు.. మరో తుఫాను పొంచి ఉందని హెచ్చరికలు ఉంటే కరకట్ట పటిష్ట పరిచే చర్యలు చేపట్టట్లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ పరిస్థితి చూస్తే మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తోందని మండిపడ్డారు.

వరదల్లో నిరాశ్రయులుగా మిగిలితే రూ.2వేలు బిచ్చం వేసినట్లు అవమానిస్తారా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికలొస్తే డబ్బులిచ్చి ఓట్లు కొంటాం అనే ధీమాతో వైసీపీ నేతలు ఉన్నారని.. సర్వం కోల్పోయి ప్రజలు అల్లాడుతుంటే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్నికలు ముందు ఊరురు తిరిగిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదని జగన్‌ ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. మద్యం తాగితేనే సంక్షేమం అందించే దుస్థితికి సుమాజాన్ని తీసుకుపోయారన్న చంద్రబాబు.. షేక్ అహ్మద్ నగర్ పాత చెక్ పోస్టులో తన పెద్ద కుమారుడిని పోగొట్టుకున్న నాగమణి కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి అక్కడే ముంపునకు గురై నాగమణి పెద్దకుమారుడు చనిపోయాడు. నాగమణి ఇంటికి కాలినడకన వెళ్లి పరామర్శించిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పి రూ.లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: