చంద్రబాబు ‘చిల్లర నాయుడు’ అని కొడాలి ఫైర్‌..!

N ANJANEYULU
ఆంధ్ర‌ప్ర‌దేవ్ రాజ‌కీయాలు తాజాగా మ‌రొక‌సారి భ‌గ్గుమ‌న్నాయి. ఈరోజు ఉద‌యం టీడీపీ అధినేత చంద్ర‌బాబు మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసారు. అయితే  చంద్ర‌బాబు మాటల‌పై తాజాగా మంత్రి కొడాలి నాని స్పందించారు. శ‌వాల మీద చిల్ల‌ర ఏరుకునే చిల్ల‌ర నాయుడు రాష్ట్రంలో ఉండ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఆ జిల్లాలో జ‌రిగిన న‌ష్ట‌ము అంద‌రికీ తెలుసు అని, ఇప్ప‌టికే సీఎం ఇవ్వాల్సిన‌వ‌వి అన్నీ ఇస్తున్నార‌ని, పున‌రుద్ధ‌ర‌ణ‌కు మంత్రులు, అధికారుల‌తో స‌మీక్షిస్తున్నారు అని వెల్ల‌డించారు.
చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో అన్నారని కుంటి సాకులు చెప్పి అక్కడికెళ్లాడు. ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.  చంద్ర‌బాబు, ఎల్లో మీడియా క‌లిసి అమాయ‌కురాలైన భువ‌నేశ్వ‌రిని అల్లరి అల్లరి చేస్తున్నారని పేర్కొన్నారు.  అసెంబ్లీలో కానీ, బయట కానీ ఎక్కడ కూడా ఆమెను  మేము ప్ర‌స్తావించ‌లేద‌ని చెప్పారు. ఆమెకు ఇలాంటి భర్త, కొడుకు దొరకడం దురదృష్టమన్నారు. అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు అని, అక్క‌డ ఏడుపు మొహం పెడితే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయా అని ప్ర‌శ్నించారు.
అక్కడ పరిష్కారం కానీ స‌మ‌స్యలు ఏమి ఉన్నాయో మాకు చెప్పు.  వాటన్నింటినీ వదిలేసి నా భార్యను అవమానించారు అని పేర్కొంటున్నారు.  జగన్ ను ఇబ్బంది పెట్టి సోనియా నుంచి నీ కొడుకు వరకు సర్వ నాశనమ‌య్యారు. జగన్ పై కేసులు వేసిన వారు ఏమయ్యారో  చూశామ‌ని, జగన్ ను వేధించిన వాళ్ళకి చంద్రబాబు లాంటి నీచమైన గతి పడుతుంది అని తెలిపారు.  వైఎస్సార్ మరణం చాలా గొప్ప మరణం… నీది నీ కొడుకుది కుక్క బతుకు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు కొడాలి నాని.
ఈ రోజు వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారని,  నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావని, నువ్వు బతికున్నా సచినట్లే లెక్క..  పాపి చిరాయువు అని తీవ్రంగా మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి అని, ఏది ప‌బ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియ‌ద‌న్నారు. మేము ఏమి పుష్క‌రాల్లో గేట్లు మూసేసి షూటింగ్ పెట్ట‌లేద‌ని, పుష్క‌రాల సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఈయ‌న‌ను ఏమి చేయాలని ప్ర‌శ్నించారు. ఒకేసారి స్థాయికి మించి వ‌ర‌ద వ‌స్తే ఎవ‌రు ఆప‌గ‌ల‌ర‌ని కొడాలి నాని చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: