జ‌గ‌న్ 2.0 : జ‌గ‌న్ అందుకే జాగ్ర‌త్త ప‌డ్డాడా..?

Paloji Vinay
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి గ‌తంలో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బిల్లును వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ నిర్ణ‌యం వెనుక ఎలాంటి వ్యూహాలు ఉన్నాయ‌నేది చ‌ర్చ‌నీయంశంగా మారింది. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వానికి కోర్టుల్లో అనేక సార్లు ప్ర‌తికూల తీర్పులు రావ‌డం కొత్తేమి కాదు. ఇలా చాలా సార్లు వైసీపీ ప్ర‌భుత్వానికి కోర్టులో చుక్కెదురు అనే శీర్షిక‌తో పేప‌ర్ల‌లో వార్త‌లు చూశాం. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న చాలా నిర్ణ‌యాల‌ను కోర్టు త‌ప్పుబ‌ట్టింది.

  అందువ‌ల్ల ఈ మూడు రాజ‌ధానుల అంశం కూడా కోర్టులో ఏమ‌వుతుంది అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. రాజ్యాంగం ప్ర‌కారం రాజ‌ధానిని ఎక్క‌డ పెట్టుకోవాల‌నే హ‌క్కు రాష్ట్రానికి ఉంటుంది. కానీ, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఎదుర‌వుతాయి. ఇదే క్ర‌మంలో మూడ్ ఆఫ్ ది కోర్టు త‌మకు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్టు  జ‌గ‌న్ మోహ‌న్ ప్రభుత్వానికి అర్థ‌మ‌యిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో వివాదాల‌కు ముందే త‌ప్పించుకోవాల‌నే ఉద్ధేశంతో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలుస్తోంది. అయితే, రాజ‌ధాని నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వం చేతిలో ఉంటుంది. కానీ మూడు రాజ‌ధానుల ఏర్పాటు అనే అంశం కోర్టు ముందు ఉన్న ప్ర‌శ్న.

   అలాగే, గ‌తంలో శాస‌న‌మండ‌లి ఆమోదం పొందిందా లేదా అనే విష‌యంపై గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఇదే అంశంపై కోర్టు బిల్లును కొట్టివేసే అవ‌కాశం ఉంటుంది. దీంతో పాటు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా చేసేందుకు వీలు లేకుండా లీగ‌ల్ గ్రౌండ్స్ ఇష్యూ పై హైకోర్టు కొట్టివేస్తే సుప్రీం కొర్టుకుపోయినా ప్ర‌యోజ‌నం ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ కార‌ణంగానే కోర్టుల్లో బిల్లు వీగిపోతుంద‌నే అనుమానంతోనే ఈ బిల్లును వెన‌క్కు తీసుకున్నార‌ని, మ‌రింత ప‌క‌డ్భందీగా న్యాయ‌నిపుణుల‌తో మాట్లాడి బిల్లును తీసుకురావాల‌ని యోచిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అంతేకానీ, రైతులు పాద‌యాత్ర చేశార‌ని, టీడీపీ నిర‌స‌న తెలిపినందుకు భ‌య‌ప‌డి వెన‌క్కి త‌గ్గలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే, సానుకూల‌త వ‌చ్చిన త‌రువాతే బిల్లును పెట్టాల‌ని చూస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.
 
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: