మూడు రాజధానుల బిల్లు ఉపసంహారణ వెనుక ఆంతర్యమేమి..!

MOHAN BABU
గత ఏడు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న టువంటి 3 రాజధానుల వివాదం ఈరోజుకు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు బిల్లును ఉదాహరణ  చేసుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు చాలా కీలకంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏ ప్రకటన చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..? రాజధాని బిల్లు ఎప్పుడు తీసుకొచ్చారో తెలుసుకుందామా..?


ఏపి రాజ‌ధాని ఎంపిక‌లో 2014 నుంచి జరిగిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. 2014లో అమ‌రావ‌తి రాజ‌ధాని అని ప్ర‌క‌టించిన నాటి చంద్ర‌బాబు స‌ర్కార్, 2014 డిశంబ‌ర్ 31 సిఆర్డిఎ చ‌ట్టానికి ఆమోదం తెలిపిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.
217 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో రాజ‌ధాని ప్రాంతంగా గుర్తింపు నిచ్చారు.  రాజధాని కోసం 54 వేల ఎకరాల ప్రభుత్వ, రైతుల భూముల సమీకరణ చేయించారు. రెండు జిల్లాల లోని 56 మండ‌లాల్లో సిఆర్డిఎ, 2015 అక్టోబ‌ర్ 22వ తేదీ ప్ర‌ధాని మోదీ చేతుల మీదుగా అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌ కూడా చేశారు చంద్రబాబు. దీనిలో భాగంగానే నాలుగేళ్ల కాలంలో 7200 కోట్ల‌తో నిర్మాణాలు, రోడ్లు వేసిన గ‌త స‌ర్కార్ వేయించింది. 2019 డిశంబ‌ర్ 17 వ తేదీ న మూడు రాజ‌ధానులు అంటూ సిఎం జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌ చేశారు.  మంత్రులు క‌మిటీ, బోస్ట‌న్ క‌మిటీ. జిఎన్ రావు క‌మిటీ నివేదిక‌ల ఆధారంగా కొత్త చ‌ట్టం చేసిన వైసిపి స‌ర్కార్ ఆ దిశగా అడుగులు వేసింది.  2020 జ‌న‌వ‌రిలో సిఆర్డిఎ ర‌ద్దు, పాల‌నీ వికేంద్ర‌క‌ర‌ణ పేరిట మూడు రాజ‌ధానుల‌ బిల్లులు పెట్టిన రాష్ట్రం, ప్ర‌భుత్వ బిల్లును శాస‌న మండ‌లిలో అడ్డుకున్న ప్ర‌తిప‌క్షం, ఇలా వివాదం కొనసాగుతూ వస్తోంది.
మండలి ప‌రిణామాల‌పై ఆగ్ర‌హంతో కౌన్సిల్ నే ర‌ద్దు చేస్తూ ప్ర‌తిపాద‌న‌ చేసిన జ‌గ‌న్, ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కోర్టుల‌ను ఆశ్ర‌యించిన రైతులు, రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాలు, అటు కోర్టుల్లో ఇటు రోడ్ల మీద ఎడ‌తెగ‌ని పోరాటం చేస్తూ వచ్చారు రైతులు.

 
రెండేళ్ల గా కోర్టులో విచార‌ణ  ప్ర‌భుత్వం చ‌ట్టాల‌పై గ‌తంలోనే స్టే ఇచ్చిన హైకోర్టు, తాజా గా మూడు రాజ‌ధానుల అంశంలో వెన‌క్కి త‌గ్గిన వైసిపి ప్ర‌భుత్వం కొద్ది సేప‌ట్లో జ‌గ‌న్ చేసే ప్ర‌క‌ట‌న‌పై అన్ని వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ కొనసాగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: