దేశవ్యాప్త పట్టుకోసం కమలనాథుల ప్లాన్.. జమిలి తీసుకొస్తారా..?

MOHAN BABU
 ప్రస్తుత పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలకు వెళ్లి తిరిగి ప్రజల ఆమోదం పొందే దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పక్షాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి 2024 మే వరకు ఉంది. కానీ  ఏడాది ముందుగా 2023 లోనే తిరిగి ప్రజామోదం పొందాలని బిజెపి యోచిస్తోంది. అయితే ఈ సారి ఒక్క లోక్ సభకు మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు లోక్ సభతోనే ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఈ విధానం పై భారత ఎన్నికల కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రంలో వరుసగా అధికారం సాధిస్తున్న నాయకులు ఏకంగా ప్రధాని పీఠంపై కన్నేస్తున్నారు. ఆ పదవికి తనను మించిన సమర్ధులు లేరని భావిస్తున్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కాగానే మమతాబెనర్జీ ఏకంగా కాబోయే ప్రధానిగా తనను తాను భావించుకుంటున్నారు.

తెలంగాణలోనూ కేసీఆర్ పరిస్థితి  అలాగే ఉంది. ఇక మాయావతి జాతీయస్థాయిలో తనకు మించిన ఆదరణ మరెవ్వరికీ లేదని ఊహిస్తున్నారు. వీరే కాదు మరి కొందరు నాయకులు కూడా ప్రస్తుతం అధికారంలో లేకున్నా కాబోయే ప్రధానినంటూ  ఊహల్లో తేలుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉద్యమాలు జోరందుకుంటున్నాయి. కేరళలో మతఘర్షణలు పెరిగాయి. ఏపీలో పార్టీల మధ్య వివాదాలు తారస్థాయికి చేరాయి. రాజస్థాన్ లో అంతర్గత రాజకీయాలు భగ్గుమంటున్నాయి. పంజాబ్ లో పరిస్థితులు చేజారిపోయాయి. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఉద్యమాలు వారి సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా బలంగా వేళ్ళూనుకోవడానికి బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ దశలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టి పార్టీల బలాబలాలు, సామర్ధ్యాలకు సవాల్ విసరడం ద్వారా జాతీయ స్థాయిలో తన సామర్థ్యాన్ని, ప్రజా బలాన్ని నిరూపించుకోవాలన్నది బిజెపి యోచనగా  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: