మూడు రాజ‌ధానుల ర‌ద్దు : బాబు విజ‌యం ఇది కానీ?

RATNA KISHORE
ఇప్పుడిప్పుడే రాజ‌ధాని రాజ‌కీయాలను అడ్డం పెట్టుకుని ఎదిగేందుకు సిద్ధం అవుతున్న బీజేపీకి, టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్ జ‌గ‌న్ సీన్ లోకి వ‌చ్చారు. అవును ఆయ‌న ఉద్దేశం ఇది కాక‌పోయినా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా అంగీక‌రించేందుకు అవ‌కాశం లేక‌పోయినా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆ రెండు పార్టీలూ రాష్ట్రంలో త‌మ ఉనికిని చాటుకోకూడ‌ద‌న్న ఉద్దేశంతో జ‌గ‌న్ త‌న దైన పంథాలో చ‌క్రం తిప్పేందుకు అసెంబ్లీని వేదిక‌గా చేసుకోనున్నారు. దీంతో ఇవాళ రాజ‌ధానిపై ఓ స్ప‌ష్టం అయిన స‌మాచారం ఇచ్చి అసెంబ్లీ సెష‌న్ ను క్లోజ్ చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మాచారం ఏదీ లేదు. కానీ కొడాలి నాని మాత్రం బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ఓ స్ప‌ష్టం అయిన సంకేతం ఇచ్చి టీడీపీకి స్వీటు తినిపించారు. కానీ ఆ తీపి వెనుకే చేదు అంతా  దాగి ఉంద‌న్న‌ది  నిష్టుర స‌త్యం.
మూడు రాజ‌ధానులకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఉప‌సంహ‌రించుకోనున్నామ‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ఇవాళ హైకోర్టుకు వి న్న‌వించారు. దీంతో ఇంత‌కాలం రాజ‌ధానులకు సంబంధించి అంశం పై నెల‌కొన్న సందిగ్ధ‌త తొల‌గిపోయింది. అయితే మూడు కాదు రెండు రాజ‌ధానుల ఏర్పాటుకు తాము సుముఖం అని సీఎం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు అంటున్నాయి. ఇవేవీ కాదు వైజాగే మా రాజ‌ధాని అని ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని తేల్చేస్తున్నాయి ఇంకొన్ని వ‌ర్గాలు. ఏదేమ‌యిన‌ప్ప టికీ కాసేప‌ట్లో క్యాబినెట్ భేటీ అనంత‌రం పూర్తి వివ‌రాలు అందేందుకు ఛాన్స్ ఉంది. అందాక వ‌చ్చేవ‌న్నీ ఊహాగానాలే!
ఇక మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ చేస్తే ఆ క్రెడిట్ మొత్తం బాబుకు వెళ్లిపోతుంది. ఎందుకంటే రాజ‌ధాని రైతుల‌ను అడ్డం పెట్టుకుని ఇంత‌కాలం చేస్తున్న ఉద్య‌మానికి అధినేత ఆయ‌నే క‌నుక! ఈ ద‌శ‌లో అలాంటి సానుకూల ప‌రిణామాలు టీడీపీ విష‌య‌మై ఏర్ప‌డ‌డం ఇష్టంలేక, క‌ష్టం అయినా స‌రే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఒప్పుకునేందుకు కాస్త ఎక్కువ అవ‌కాశ‌మే ఉంది.
మ‌రోవైపు టీడీపీ ఎంత‌గానో పొలిటిక‌ల్ మైలేజీ ఇచ్చిన మ‌రియు ఇస్తున్న అమ‌రావ‌తిని తమ‌కు అనుకూలంగా మార్చి, ఏ క్ష‌ణంలో అయినా జ‌గ‌న్ రాజ‌ధాని రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: