చంద్రబాబు ఏడుపు సంతోషం కలిగించింది?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకే విషయంపై చర్చ జరుగుతుంది. ఇటీవల అసెంబ్లీలో కంటతడి పెట్టిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటికి వచ్చిన సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఇక ఈ మీడియా సమావేశంలో కూడా చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు చంద్రబాబు నాయుడు. అయితే ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి పాలన సాగించిన వ్యక్తి.. ఇక ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా వ్యక్తిగత దూషణ కారణంగా  కన్నీళ్లు పెట్టుకోవడం ఎంతోమంది మదిని కదిలించింది అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం టిడిపి వైసిపి నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు తో విరుచుకుపడుతోంది.

 అదే సమయంలో కుప్పం లో ఓడిపోయాను అన్న కారణంతో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు అని అందుకనే వ్యక్తిగత దూషణ చేశాము అంటూ అసత్య ప్రచారం చేస్తూ చివరికి ఏడుస్తూ కొత్త డ్రామాకు తెరలేపారు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇక మరికొంతమంది ధైర్యంగా ఉండాల్సిన చంద్రబాబు ఇలా కంటనీరు పెట్టుకుంటే ఎలా ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాజకీయ చాణిక్యుడు గా ఉన్న చంద్రబాబు కంట నీరు పెట్టుకోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక చంద్రబాబు కంట నీరు పెట్టుకోవడంపై ఇటీవలే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కుప్పంలో ఓడిపోవడంతో ఒత్తిడికి లోనై చంద్రబాబు అసెంబ్లీ లో వింతగా ప్రవర్తించారు అంటూ వ్యాఖ్యానించారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక చంద్రబాబు ఏడవడం చూస్తే తనకు ఎంతగానో సంతోషం కలిగింది అంటూ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చంద్రబాబు జగన్ కుటుంబం పై ఎన్నో సార్లు విమర్శలు చేశారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. గుజరాత్ లో దొరికిన హెరాయిన్ కు కాకినాడ కు లింకు పెట్టి తనకు సంబంధం ఉంది అని అసత్య ప్రచారాన్ని చంద్రబాబు చేశారని... చంద్రబాబు ఇలా చేసిన సమయంలో తన కుటుంబం కూడా ఎంతో బాధపడింది అంటూ కాకినాడ  ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: