వ్యవసాయ చట్టాల రద్దు వెనుక అసలు రహస్యం ఇదేనా..!

MOHAN BABU
ప్రధాని నరేంద్ర మోడీ  జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ నూతన చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ సుమారు ఏడాది నుంచి దేశ రాజధాని ఢిల్లీకి సరిహద్దుల్లో అకుంటిత దీక్షతో ఉద్యమాన్ని చేపట్టిన అన్నదాతల విజయంగా భావించవచ్చు. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి గట్టి దెబ్బ తగిలిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే అయిదు అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా పంజాబ్,ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతుంది.ఉత్తరప్రదేశ్ లో కీలక ప్రాంతం పశ్చిమ యూపీ. మొత్తం 403 స్థానాలకు గాను ఇక్కడ 130 సీట్లు ఉన్నాయి. ఇక్కడ యోగిసర్కార్ గెలవడం ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ చట్టాల ఉపసంహరణకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తున్నది.

వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చాం ఒక కూటమి భాగస్వామ్య అకాలీదళ్ తో చేరిన తర్వాత పంజాబ్ లో ఒంటరిగా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధమైంది.రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రచారానికి వెళ్లాలంటే జంకుతున్నారు.అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను తమకు అనుకూలంగావినియోగించుకోవడంలో విఫలమయినట్టు కమలదళం గుర్తించింది.ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రైతుల సమస్య పరిష్కారం అయినప్పుడే ప్రజలు స్వాగతించగలరని గ్రహించిన పార్టీలు బీజేపీతో చేతులు కలిపేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ నిరసనల్లో ఖళీస్తాన్ అంశాలు చొచ్చుకుపోయి ప్రాథమిక డిమాండ్లను మతపరంగా వినియోగించుకుంటున్నారని దీని వల్ల భద్రతా వ్యవస్థకు తీవ్ర ముప్పు ఏర్పడవచ్చని మోడీ సర్కారు భావిస్తోంది. దేశానికి సరిహద్దు రాష్ట్రంగా ఉన్న పంజాబ్ నిరసనల్లో ఖళీస్తాన్ అంశాలు చొచ్చుకు పోయే అవకాశాలున్నాయన్న దానిపై ఆందోళనలు వ్యక్తం కావడంతో ఈ చట్టాలను రద్దు చేసుకున్నట్లు కేంద్రంలోని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: