జనం చస్తుంటే.. ఏంటీ మీ భజనలు ..?

Veldandi Saikiran
మొన్నటి వరకు పూర్తిగా సైలెంట్గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు... ఒక్కసారిగా మళ్లీ ఎగిసి పడుతున్నాయి.   నిన్న అసెంబ్లీ సమావేశం ఘటన అనంతరం.. కొత్త రాజకీయాలు ఏపీలో తెరపైకి వచ్చాయి.  అధికార వైసీపీ పార్టీ నేతలు...  తన భార్య శీలాన్ని శంకించారంటూ అసెంబ్లీలో... తెలుగుదేశం పార్టీ  అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళనకు ఆవేదనకు గురయ్యారు. అంతే కాదు.. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవరకు.. అసెంబ్లీ లో అడుగు పెట్టి బోననీ...స్పష్టం  చేసి మరీ అసెంబ్లీ బయటకు వచ్చారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆ ఎపిసోడ్ అనంతరం వెంటనే... తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆ వెంటనే ప్రెస్ మీట్ నిర్వహించారు నారా చంద్రబాబు నాయుడు. అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. 

అధికార వైసీపీ నేతలు తన కుటుంబం పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు నారా చంద్రబాబు నాయుడు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని... స్పష్టం చేశారు చంద్రబాబు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా చంద్రబాబు కంట తడి చుట్టే.. కేంద్రీకృతమయ్యాయి. చంద్రబాబు కంట తడి అంతా నాటకమని అటు వైసిపి నేతలు ఒక్కొక్కరుగా ఆయనపై మండిపడ్డారు. చంద్రబాబుకు నాటకాలు వెళ్ళడం కొత్తేమీ కాదని... నందమూరి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి మరి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు.  అంబటి రాంబాబు నుంచి కొడాలి నాని వరకు అందరూ ఆయన పై నిప్పులు చెరిగారు. ఇక వైసిపి నేతల దాడి కి కౌంటర్ గా నందమూరి ఫ్యామిలీ ఈ రోజున మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చింది.

అన్యాయంగా మహిళలను టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వం పై ఇండైరెక్ట్గా ఫైర్ అయింది నందమూరి  ఫ్యామిలీ. అయితే నందమూరి ఫ్యామిలీ కి వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్వయంగా కౌంటర్ ఇచ్చారు. నందమూరి ఫ్యామిలీ ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా తయారయ్యాయి. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ.. రాయలసీమ జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షాలకు   రాయలసీమ ప్రజలు అనేక ఇబ్బందులు  పడుతున్నారు.  చాలామంది వరదల ధాటికి  గల్లంతు అవుతుంటే.. తీవ్రంగా పంట నష్టం వాటిల్లుతోంది. అయితే భారీ వర్షాలకు ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఏపీ రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రజలను ఆదుకోవాల్సినది పోయి నాయకులే కొట్టుకుంటున్నారు అని.  అసహనం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.  వెంటనే... భారీ వర్షాల్లో కష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: