కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో.. ఆయనకు కీలక పదవి..!

MOHAN BABU
 మండలి పదవుల భర్తీ పూర్తి చేసిన సీఎం కేసీఆర్ త్వరలో మంత్రివర్గంలో కూడా మార్పులు చేసేందుకు  కసరత్తును మొదలుపెట్టారా..? మంత్రివర్గ మార్పులు ఉంటే ఒకటి,రెండు ఉంటాయా లేదా భారీ మార్పులు ఉంటాయా..? తెలంగాణ రాజకీయాల్లో తన మార్కు ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు ప్లాన్ చేశారట. రాష్ట్రం లో ముచ్చటగా మూడో సారి  అధికార పగ్గాలు చేపట్టడానికి ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారని ప్రగతి భవన్ వర్గాలు అంటున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లాల వారీగా వచ్చే ఎన్నికల నాటికి గెలుపు గుర్రాలను కూడా సిద్ధం చేసే పనిలో ఉంటూనే , ఎన్నికల క్యాబినెట్ కూర్పు దిశగా కసరత్తులు చేస్తున్నారట. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కూడా ఆలోచిస్తున్నారన్న  చర్చ జరుగుతుంది. సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా కొత్తవారికి అవకాశం కల్పించడం ఉన్నవారిలో కొందరిని తప్పించే యోచనలో ఉన్నారని అంటున్నారు.

2023 అక్టోబర్,నవంబర్ మధ్య జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను గులాబీ బాస్ సన్నద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తే మంత్రి మల్లారెడ్డి ని తొలగించి ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి చెక్ పెడతారని అంటున్నారు. అదే జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డిని తిరిగి మండలి చైర్మన్ గా నియమించాలని భావిస్తున్న తనకు క్యాబినెట్ పదవే కావాలంటూ గుత్తా పట్టు పడుతున్నారట. ఇక ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ఉద్వాసన పలికే చాన్స్ ఉందని చెబుతున్నారు. ఆ జిల్లా నుంచి మాజీ మంత్రి జోగు రామన్న కు మున్నూరు కాపు కోటాలో అవకాశం కనిపిస్తారట. వరంగల్ జిల్లా నుంచి ఇప్పటికి ఇద్దరు మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు. మొత్తానికి ఈ పదవుల సంగతేమోగాని మంత్రుల్లో,టీఆర్ఎస్ నేతల్లో ఈ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. మరి అధినేత మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: