ఎన్నికల్లో గెలిస్తే.. కొడతారా?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఏమో అన్న విధంగా వాడివేడిగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నుంచి మున్సిపల్ ఎన్నికలు జడ్పిటిసి ఎంపిటిసి లకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతూ ఉండడంతో ఏపీ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారిపోయాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో కూడా వైసీపీ ఘన విజయం సాధించింది అని చెప్పాలి. టీడీపీకి అందనంత దూరంలో వైసిపి భారీ స్థానాలను గెలుచుకుంది. అయితే అటు ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను తీసుకురావడం కారణంగానే వైసీపీ విజయం సాధించింది అని టీడీపీ విమర్శలు చేస్తోంది.

అయితే వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడులు మాత్రం ఎక్కడా ఆగడం లేదు అన్నది విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవలే గుంటూరు జిల్లా శావల్యాపురం లో తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం సంచలనం గా మారిపోయింది. అయితే ఇక ఇలా టిడిపి కార్యకర్తలు పై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంను మాత్రం టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది.  గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి లో  టిడిపి వర్గీయులు ఇళ్లపై బీరు సీసాలు రాళ్లు కర్రలతో మూకుమ్మడిగా దాడికి దిగారు వైసీపీ శ్రేణులు.

 అయితే ఇక ఈ దాడికి సంబంధించిన సంఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి మరీ దాడికి పాల్పడ్డారు అంటూ టిడిపి ఆరోపిస్తోంది. అయితే టిడిపి వర్గీయులు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ నాయకుల ధర్నా నిర్వహించారు. జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పారా హైమావతి వైసిపి అభ్యర్థి పై విజయం సాధించడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయినా వైసీపీ శ్రేణులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు అంటూ టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సీసీ కెమెరాలను ధ్వంసం చేయడానికి వెళ్లిన కూడా అది రికార్డు అవుతుంది కదా. అలా కాకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం ఎలా కుదురుతుంది.. టిడిపి నేతలు పెద్ద డ్రామాకు తెరలేపారు అంటూ అధికార వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఏది నిజం అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: