పంజాబ్ లో బీజేపీ కొత్త ప్లాన్.. ఆ పార్టీతో జట్టు?

praveen
గత కొన్ని రోజుల నుంచి పంజాబ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాల కారణంగా పంజాబ్ ముఖ్యమంత్రి గా ఉన్న కెప్టెన్ అమరేందర్ సింగ్ కాస్త చివరికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత ఇటీవలే ఏకంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఏకంగా కొత్త పార్టీ పేరును ప్రకటించి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ సంచలనం సృష్టించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పేరును తన కొత్త పార్టీ పెట్టారు అమరేందర్ సింగ్.

 అంతే కాదు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఇక వచ్చే ఏడాది ప్రారంభం లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం లో ప్రస్తుతం వ్యూహాత్మకం గా అడుగులు వేస్తూ  ఉండడం గమనార్హం. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత పంజాబ్ లో జరుగుతున్న వ్యవహారం గురించి కూడా పూర్తిగా అన్ని విషయాలను బయటపెట్టారు.

 ఈ క్రమం లోనే ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల  లో భారతీయ జనతా పార్టీ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని  ఇటీవలే కెప్టెన్ అమరేందర్ సింగ్  ప్రకటించడం పంజాబ్ రాజకీయాలు మరింత చర్చనీయాంశం గా మారి పోయింది. అయితే అమరేందర్ సింగ్ ఈ ప్రకటన చేసిన తర్వాత అటు మిగతా పార్టీలు అన్నీ కూడా బిజెపిపై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ముందుగా వ్యవసాయ సాగు చట్టాలను తీసుకు వచ్చి తద్వారా రైతుల్లో వ్యతిరేకత తీసుకొచ్చి  అమరేందర్ సింగ్ ను పార్టీ నుంచి బయటికి తీసుకు వచ్చేందుకు బిజెపి ఇన్ని కుట్రలు చేసింది అంటూ వివిధ పార్టీలు విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp

సంబంధిత వార్తలు: