తెలంగాణకు అరుదైన గౌరవం..పురపాలక శాఖలో 12 అవార్డులు !

Veldandi Saikiran
ఢిల్లీ : ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్.  అవార్డుల కార్యక్రమానికి  తెలంగాణ రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి  కె టి రామా రావు కూడా హాజరయ్యారు.  స్వచ్ఛ సర్వేక్షన్, సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ , చెత్తరహిత నగరాలు కేటగిరీల కింద అవార్డుల ప్రధానం ఈ సందర్భంగా జరుగనుంది.  మూడు కేటగిరీల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ పలు అవార్డులు వచ్చాయి.  ఈ మేరకు అవార్డులు అందుకున్నారు ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు.  రెండు రాష్ట్రా ల్లోని పలు నగరాలు, మున్సిపాలిటీల కు అవార్డులు అందుకున్నారు. 

స్వచ్చ సర్వే క్షన్, సఫాయి మిత్ర సురక్ష చాలంజ్,  చెత్తరహిత నగరాల కేటగి రీల కిం ద అవార్డులు అందజేశారు.   మూడు క్యాటగీరి లో తెలంగాణ రాష్ట్రానికి కు మెత్తం 12 అవార్డులు వచ్చాయి.  స్వచ్ సర్వే క్షన్ విభాగం లో సిరిసి ల్ల , ఘట్కేసర్, జీహేచ్ ఎమ్ సి, సిద్దిపేట్, నిజామ్ పేట్, ఇబ్రహీంపట్నం, కోస్గి, హుస్నాబాద్ మున్సిపాలిటిలకు దక్కాయి అవార్డులు.  చెత్త రహిత నగరంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కి అవార్డు దక్కడం గమనార్హం.  సపాయి మిత్ర సురక్ష చాలేంజ్ విభాగంలో రాష్ట్రాల క్యాటగిరి లో తెలంగాణకు , నగరాల క్యాటగీరిలో కరీంనగర్ కు దక్కాయి అవార్డులు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మెత్తం 12 అవార్డులు.. రావడం పై సీఎం కేసీఆర్‌ కాకుండా.. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా హర్షం వ్యక్తం చేశారు.   ఇలా ంటి అవార్డులు దక్కడం గర్వ కారణంగా ఉందని పేర్కొన్నారు మం త్రి కల్వకుంట్ల తారక రామారావు. ఇలాంటి అవార్డులు రావాలని పేర్కొన్నారు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: