కొత్త రూట్ ఎంచుకున్న స్మగర్లు !!

Veldandi Saikiran
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లో భారీ గా బంగారం పట్టు కున్నారు పోలీసులు. రూ. 42 కోట్ల విలువ చేసే 86 కేజీల బంగారం పట్టుబడడం తీవ్ర కలకలం రేపినట్లు సమచారం అందుతోంది.  హాంకాంగ్ నుండి ఎయిర్ కార్గో ద్వార ఢిల్లీ వచ్చిన ఓ పార్శిల్ లో భారీగా బంగారం గుర్తించారు డిఆర్ఐ అధికారులు.  కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కొత్త కొత్త పద్దతుల ద్వారా రవాణా చేస్తున్నారు స్మగ్లర్లు.  బంగారాన్ని కరిగించి ట్రాన్స్‌ఫార్మర్ ఎలక్ట్రోప్లేటింగ్ మెషిన్‌ లో దాచిన కేటుగాళ్లు. 80 ట్రాన్స్‌ఫార్మర్ ఎలక్ట్రోప్లేటింగ్ మెషిన్‌ లో 86 కేజీల బంగారం దాచి, బంగారం గుర్తుపట్ట రాకుండా నికెల్ తో పూసి తరలించే యత్నం చేశారు స్మగ్లర్స్.   

విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ కార్గో లో తనిఖీలు నిర్వహించిన డి ఆర్ ఐ అధికారులు. అత్యాధునిక స్కానింగ్ లో బయట పడింది అక్రమ బంగారం గుట్టు.  86 కేజీల బంగారం సీజ్…….. నలుగురు విదేశీయులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న డి ఆర్ ఐ అధికారులు. దక్షిణ కొరియా దేశస్థులు ఇద్దరు, చైనా,  తైవాన్ దేశస్థులు ఇద్దరు గా గుర్తింపు. ఈ అక్రమ‌ బంగారం రవాణా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం వుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారుల బృందం.

 'మోల్టెన్ మెటల్' అనే కోడ్-పేరుతో విదేశీ బంగారం అక్రమ రవాణా కు తెర లేపారు కేటుగాళ్లు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన గుర్గావ్‌, చత్తర్ పూర్  లో ఫామ్‌ హౌజ్, అపార్ట్‌మెంట్‌లను అడ్డాగా చేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ లో ఢిల్లీ కి చెందిన ఓ నగల వ్యాపారిని అరెస్టు చేసి అతని వద్ద మరో 6 కేజీల బంగారం సీజ్ చేసినట్లు సమాచారం అందుతోంది. భారత దేశ వ్యాప్తంగా మొదటి సారి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ 86 కేజీల బంగారం పట్టుబడడం ఇదే ప్రథమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: