ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడు..!!

Veldandi Saikiran
అమరావతి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏడవటం పై మంత్రి కొడాలినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.  రాజకీయం గా బ్రతకడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు కొడాలి నాని. ముఖ్యమంత్రి పదవి కోసం భార్యాను కూడా బజారుకు ఇడ్చాడని.. చంద్రబాబు అసెంబ్లీ వచ్చిన చివరి రోజు ఈ రోజేనాని పేర్కొన్నారు కొడాలి నాని. చంద్రబాబు అసెంబ్లీ లో జగన్ ని ఎన్ని తిట్టించాడని అగ్రహించారు కొడాలి నాని. ఎన్టీఆర్ నుండి పార్టీ లాక్కుoటే.. ఎన్టీఆర్ కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చాడని నిప్పులు చెరిగారు కొడాలి నాని. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు లాగా బయటకు వచ్చి ఏడవలేదని చురకలు అంటించారు కొడాలి నాని. 

చంద్రబాబు సతీమణి పై ఎవరు వ్యాఖ్యలు చేశారో, ఏమని వ్యాఖ్యానించారో ఎందుకు చెప్పటం లేదు అని  చంద్రబాబు పై నిప్పులు చెరిగారు కొడాలి నాని. మేము ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆన్ రికార్డు ఉంటాయి కదా... ? అని ఎద్దేవా చేశారు కొడాలి నాని. సానుభూతి కోసం మేము తన సతీమణి ని వ్యాఖ్యానించినట్టు చంద్రబాబు డ్రామా ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు కొడాలి నాని. చంద్రబాబు ను ఏమి చేయాలో ఆ పార్టీ ఎంఎల్ఏలే ఆలోచించుకోవాలని చురకలు అంటించారు కొడాలి నాని. భార్య ను కించపరుస్తు వ్యాఖ్యలు చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతాను అని శపథం చేయటానికి అర్థం ఏమైనా ఉందా ? అని నారా చంద్రబాబు నాయుడు పై చిందులు వేశారు కొడాలి నాని.


 గొడవ అయిన తరువాత నవ్వుకుంటు చంద్రబాబు సభ నుండి బయటకు వెళ్ళారని మండిపడ్డారు కొడాలి నాని. తన సభ్యుల తో సమావేశం పెట్టుకుని డ్రామాకు తెర తీశాడు అని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి నాని.  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గతం లోనూ ఇలా అనేక డ్రామాలు ఆడాడని అగ్రహించారు కొడాలి నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: