మోడీడి చాలా గొప్ప మనసు: తెలంగాణా మంత్రి

Gullapally Rajesh
వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ ప్రకటన చేసిన నేపధ్యంలో ఇప్పుడు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేడు చేసిన ప్రకటనతో అన్ని రాష్ట్రాల్లో రైతులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇక తెలంగాణాలో అధికార విపక్షాలు రైతులకు ధన్యవాదాలు చెప్పాయి. ఇక దీనిపై తెలంగాణా వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం సంతోషం అని అన్నారు. ముందే ఈ నిర్ణయం తీసుకుంటే రైతుల ప్రాణాలు దక్కేవి- కేంద్రం పరువు దక్కేది అని పేర్కొన్నారు.
 రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చింది అని ఆయన పేర్కొన్నారు. అమరులైన కుటుంబాలను ఆదుకునే భాద్యత కేంద్రం తీసుకోవాలి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు.  రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం పలుచన అవుతోందని ఈ నిర్ణయం అని ఆయన వివరించారు. టిఆర్ఎస్  మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించారు అని అన్నారు. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నాం అని  ఆయన తెలిపారు. ఇది ప్రజల విజయం అన్నారు నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్  పార్టీ జాకీలు పెట్టి లేపినా లెవదు అని ఆయన.
నల్లచట్టాలకు కాంగ్రెస్  పురుడు పోస్తే- పెంచిపోషించింది బీజేపీ అని మండిపడ్డారు.  వడ్ల కొనుగోళ్ల పై మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 2015లో శాంత కుమార్ కమిటీ ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి అని  విజ్ఞప్తి చేసారు. సమగ్ర వ్యవసాయ పధ్ధతిపై కేంద్రం దృష్టి పెట్టాలి అని కోరారు. బాయిల్డ్ రైస్ కేవలం అన్నం తినడానికి మాత్రమే కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి అని అన్నారు ఆయన. కేంద్రం కొత్త టెక్నాలజీని ఉపయోగించడం లేదు అని మండిపడ్డారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు మా పోరాటం సాగిస్తాం అని స్పష్టం చేసారు. నిన్న ధర్నా నడిచే సమయంలో కావాలనే ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి లీక్ ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: