ఈ గోస తెలంగాణ‌లో లేదు.. దేశం మొత్తం

N ANJANEYULU
 హైద‌రాబాద్‌లోని ఇందిరా పార్కు వ‌ద్ద చేప‌ట్టిన టీఆర్ఎస్ మ‌హాధ‌ర్నాలో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై మాట్లాడారు. సంవ‌త్స‌రం కాలం నుంచి ల‌క్ష‌ల మంది రైతులు వ‌రుసగా రైతులు నిర‌స‌న చేప‌డుతూ దీక్ష‌లు చేస్తున్నారు. మా బ‌తుకులు నాశ‌నం అవుతున్నాయి. మీరు తెచ్చిన చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయండి. పండిన పంట‌కు ఎంత ధ‌ర ఇప్పిస్త‌రో చెప్పండి. ఆ ఒక్క మాట చెప్ప‌లేక కేంద్రం త‌న విధానాన్ని మార్చుకోకుండా అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడుతుంది. ఇప్ప‌టిదాకా పాలించిన అన్ని పార్టీల ప్ర‌భుత్వాలు దారుణంగా విఫలం చెందాయి.
పంట‌లు కొన‌డానికి భ‌యం అయితుంది. వాస్త‌వం ఏమిటి.. అడ్డ‌గోలుగా మాట్లాడడం కాదు. గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్ చేసిన స‌ర్వేలో  116 దేశాలను స‌ర్వే చేస్తే భార‌త దేశం యొక్క స్థానం 101. బంగ్లాదేశ్‌, నేపాల్‌, పొరుగున ఉన్న పాకిస్తాన్ కంటే త‌క్కువ ఉన్న‌ది భార‌త‌దేశం.  దాదాపు 12 కోట్ల  రైతులు ఉన్నారు. ప్ర‌కృతి ఇచ్చిన‌టువంటి జీవ‌న‌దులున్నాయి. శాస్త్రవేత్త‌లున్నారు. బంగారు పంట‌లు పండే అవ‌కాశం ఉంది. బ‌తికేరంగాన్ని ఎందుకు నిర్ల‌క్ష్యం చేయాలి. కేంద్రం పాల‌సీ ఏమిటి..?  రైతుల‌ను బ‌తుక‌నిస్త‌రా..? బ‌తుక‌నివ్వ‌రా..? క‌రెంట్ స‌క్క‌గా చేసుకుని, కోల్పోయిన విశ్వాసాన్ని క‌లిగించి పంట‌లు పండిస్తున్నాం. ఎఫ్‌సీఐ ద్వారాపుట్టుకొచ్చిన గోదామ్‌లు కేంద్రం వ‌ద్ద ఉన్నాయి. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేవుని, ఆదుకోవాలి. పేద‌రికంలో ఉన్న ప్ర‌జ‌లు, హంగ‌ర్ ఇండెక్స్  ఆక‌లి దేశం భార‌త‌దేశం అని తెలియ‌జేస్తుంది. కేంద్రం చేయ‌కుండా ప్ర‌యివేటు ప‌రం చేస్తాం. మార్కెట్ క‌మిటీల‌ను ర‌ద్దు చేస్తాం అని పేర్కొంటుంది.
స‌మ‌స్య విష‌యాన్ని అర్థం చేసుకునే ఇంగిత జ్ఞానం లేని  ప‌రిపాల‌న  చేస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. రైతుల మీద కార్ల‌ను ఎక్కించి చంపి.. రైతుల క‌ల్లాల వ‌ద్ద‌కు వెళ్లి రాజ‌కీయ డ్రామాలు ఆడుతున్న‌రు. మేము పండించిన ధాన్యం సేక‌రిస్తారా.?  లేదా..? అడ్డ‌గోలుగా డొంక‌తిరుగుడు మాట‌లు మాట్లాడి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నారు. బ్ర‌హ్మండంగా రైతులు రూ.5ల‌క్ష‌లు తీసుకుంటున్న‌రు. ప్ర‌తీ జిల్లాకు న‌వోద‌య పాఠ‌శాల‌లు పెట్టాల‌ని  చ‌ట్టంలో ఉన్నా చ‌ట్టాల‌ను కాల‌రాస్తుంది. వ‌డ్లు కొంటాం అని ఎఫ్‌సీఐ లెట‌ర్ ఇస్తే.. బియ్యాన్ని బీజేపీ ఆఫీస్ ముందు గుమ్మ‌రిస్తాం.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల కోసం భ‌య‌ప‌డం. అవ‌స‌ర‌మే అనుకుంటే.. త‌ప్ప‌కుండా టీఆర్ఎస్ రైతుల స‌మ‌స్య‌ల కోసం లీడ‌ర్ షిఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంద‌ని చెప్పారు. అనేక స‌మ‌స్య‌లు పెండింగ్‌లో పెట్టారు. ద‌ళితుల వ‌ర్గీక‌ర‌ణ శాస‌న స‌భ తీర్మాణం చేసి పంపారు దానిని ప‌ట్టించుకోలేదు.
బీసీ కుల గ‌ణ‌న చేయండి అని అడిగితే స‌మాధానాలు రావు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడల్లా డ్రామాలు ఆడుతున్నారు. స‌ర్జిక‌ల్ స్ట్రైకులు, నాట‌కాలు న‌డ‌వ‌వు.  చాట్ల త‌వుడు పోసి కుక్క‌ల మ‌ధ్య కొట్లాట పెట్టిన‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తీ ఇంటికి మంచినీరు అందించాలి. ప‌రిష్కార మార్గాలు చేసే తెలివి లేదు. ఎల‌క్ష‌న్ వ‌స్తే హిందూ, ముస్లింలకు కొట్లాట‌లు పెడ‌తారు. దీని కోస‌మేనా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌ది ప్ర‌జ‌లు అని సీఎం ప్ర‌శ్నించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: