తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !

Veldandi Saikiran
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ బిజేపి పార్టీ పై మండిపడ్డారు. వానాకాలం పంట పూర్తిగా ప్రభుత్వ కొంటుందని.. రైతులకు హామీ ఇచ్చారు.  జిల్లాలో 52 వేల మెట్రిక్ టన్నులు కొన్నామని, ఇంకా 3 లక్షల తన్నుల పంట కొనవల్సి ఉందని..  తడిసిన దాన్యం కూడా కొనే ప్రయత్నం చేయాలని అధికారులకు తెలియ జేశానని వెల్లడించారు కేటీఆర్. తెలంగాణ  రాష్ట్రం లో 4,743 దాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం సేకరిస్తున్నామని వెల్లడించారు కేటీఆర్. రాజ్యాంగం ప్రకారం దాన్యం కొనుగోలు విషయము లో కేంద్రం రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉండాలని పేర్కొన్నారు కేటీఆర్.  తెలంగాణ రాష్ట్రము లో వ్యవసాయానికి, నీటి వసతులకు కేంద్రం ఎలాంటి సహాయాన్ని అందించలేదని గుర్తు చేశారు.   యాసంగి దాన్యం కొనమనే అనేదాన్ని కేంద్రం పునసమీక్షించుకోవాలని వెల్లడించారు కేటీఆర్. 

రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇందిరా పార్క్ వద్ద దర్నాకు కూర్చోబోతున్నామని ప్రకటించారు కేటీఆర్. కేంద్రానికి తెలంగాణ ధనం కావాలి కానీ, దాన్యం వద్దు అనే కేంద్ర విదానాన్ని వ్యతిరేఖిస్తున్నాం. కేంద్రం రెండు నాల్కల ధోరణిని ఎండగట్టబోతున్నామని స్పష్టం చేశారు. స్థానిక బిజెపి అసత్య ప్రచారాన్ని నమ్మి వరి పంట వేస్తే రైతు నష్ట పోతాడని వెల్లడించారు. యాసంగి వరి దాన్యం కొనే విషయం నిజమైతే, రాతపూర్వకముగా కేంద్రం పూర్తి పంట కొంటామని వ్రాసి ఇవ్వాలని డిమాండ్ చేశారు కేటీఆర్. లేని పక్షములో బండి రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలి. ముఖ్యమంత్రి ఆలోచనలు నమ్మండని కోరారు కేటీఆర్.  పనికిమాలిన వారి మాటలు నమ్మి మోసపోకండన్నారు. ఈతకు విద్యార్థులు చనిపోవడం దారుణమని..  ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులను ఆదేశించానన్నారు. దుర్ఘటన జరిగిన ప్రదేశములో హెచ్చరిక బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించాను... నీరు పైకి ఒకే రకముగా కనిపిస్తుంది, కానీ క్రిందికి ఒకే రకముగా ఉండదన్నారు.  తల్లిదండ్రులు పిల్లలకు జాగ్రత్తలు చెప్పాలి, పిల్లలు గమనించాలని కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: