ఈటెల‌కు గులాబీ నేత‌లు ట‌చ్‌లో ఉన్నారా..?

Paloji Vinay
ఒక్క గెలుపు తెలంగాణ రాజ‌కీయాల‌ను, సీఎం కేసీఆర్ లో మార్పు తెస్తుంద‌ని భావించింది నిజం అయ్యేలా కనిపిస్తోంది. ఈటెల రాజేంద‌ర్ గెలుపు కేసీఆర్ ఓట‌మి అనే తీరులో తెలంగాణ రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇదే క్ర‌మంలో తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఉన్నవి 19 సీట్లే కానీ ఆశావాహులు మాత్రం బోలెడు. దీంతో కేసీఆర్ ఎవ‌రికి సీట్లు ఇస్తారో అనే విష‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది. మ‌రోప‌క్క ఎమ్మెల్సీ సీట్లు రాక‌పోతే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పెందుకు నేత‌లు చూస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఈటెల‌కు కొంద‌రు నేత‌లు ట‌చ్‌లోకి వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

 అయితే, కేసీఆర్ ఎమ్మెల్సీ ప‌ద‌వి కేటాయించ‌క‌పోతే కారు దిగి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చాలా మంది చూస్తున్నార‌ట‌. ఇంకో విష‌యంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల‌కు, ఎమ్మెల్సీల‌కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొర‌క‌డం లేద‌ట‌.. ఎంత ముఖ్య‌మైన ప‌ని ఉంది అని చెప్పి క‌లుద్దామ‌నుకున్నా వాళ్ల‌కు నిరాశే ఎదురైతున్న‌ట్టు తెలుస్తోంది. ఎమ‌నాలో తెలియ‌దు, ఏం చేయాలో తెలియని ప‌రిస్థితుల్లో.. నియోజ‌క‌వ‌ర్గం లో ప‌నులు కాక త‌లెత్తుకోలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు స‌మాచారం. క‌నీసం కేటీఆర్ ను అయినా క‌లిసి మొర పెట్టుకుందామనుకుంటే ఆయ‌న ప‌రిస్థితి కూడా అంతంతేగా ఉంది.
పోని హ‌రీష్‌రావును అడుగుదామ‌నుకుంటే ఆయ‌నకే పార్టీలో స‌రైన గౌర‌వం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ  అస‌హ‌నం కార‌ణంగా చాలా మంది ఎమ్మెల్యేలు ఈట‌ల‌కు ఫోన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రో వ‌ర్గం ఏంటంటే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులుగా ప‌ని చేస్తూ ఎలాంటి ఎదుగుద‌ల లేని నేత‌లు ఈట‌ల‌కు ట‌చ్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. గులాబీ కారులో ఇమ‌డ‌లేక పోతున్న అసంతృప్తులు అంతా ఈట‌ల వైపు చూస్తూ క‌మ‌ళం పార్టీలో చేరితో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా ఎంపీ టికెట్ ఇస్తారా, పార్టీలో గౌర‌వ‌ప్ర‌ధ‌మైన హోదా క‌ల్పిస్తారా అంటూ అడుగుతున్న‌ట్టు గుస‌గుస‌ల వినిపిస్తున్నాయి.


 ఇవ‌న్ని కాకుండా పార్టీలోకి వ‌స్తే ఏమఏ మార్గంలో రావాలని అడుగుతున్నార‌ట‌. ఇంకా ఇలాంటి సంప్ర‌దింపులు, స‌ల‌హాలు చాలానే కోరుతున్నార‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.  మ‌రి ఈట‌ల‌తో లక‌లిసి ముందుకు న‌డిచేది ఎవ‌రోనని వేచి చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: