దమ్ముంటే గూగుల్ చూసుకోండి, రికార్డులు తెలీదా: కేటిఆర్ ఆన్ ఫైర్

Gullapally Rajesh
తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్న జోష్ ఇప్పుడు కనపడుతుంది అన్నారు తెలంగాణా మంత్రి కేటిఆర్. గత పాలకులు చేసిన రైతు వ్యతిరేక విధానాలు తుడిచిపెట్టి, కాంగ్రేస్ ప్రభుత్వంలో రైతుకు ఏకంగా 5, 6 గంటలు కరెంటు ఇచ్చిన దాఖలాలు లేవు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. చెరువులు కుంటలు ఎండిపోతుంటే గుడ్లప్పగించి చూశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. దేశంలోనే రైతులు ఎక్కువగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నారు మంత్రి. మనసు మంచిగుంటే కరువు కూడా ఉండదు అని అన్నారు.
ముందే విత్తనాలు, ఎరువులు బఫర్ స్టాక్ పెట్టి షార్టేజ్ లేకుండా  ముఖ్యమంత్రి చూశారని తెలిపారు. భారతదేశంలో రైతు బంధు ద్వారా పంటకు 5 వేలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణా అని కొనియాడారు. ప్రపంచంలో రైతుకు రైతు భీమా 5లక్షలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే అన్నారు ఆయన. ఎర్రటి ఎండలో నర్మాల మత్తడి దూకుతుంటే రైతులు పులకించిపోయారు అని అన్నారు. గూగుల్ లో చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేట్ ప్రాజెక్ట్ అంటే తెలంగాణా అని చూపిస్తుంది అని ఆయన తెలిపారు. ఏడేళ్ళ లో ఎన్ని రికార్డులు సాధించామో తెలియదా అని ప్రశ్నించారు.
వరిదాన్యంలో పంజాబ్ ను అధిగమించింది తెలంగాణ అని ఆయన ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలు అధికంగా తగ్గించింది తెలంగాణ అని కేంద్రం చెప్పిందని అన్నారు. ముఖ్యమంత్రి తలుచుకుంటే వ్యవసాయం ను ఎలా అభివృద్ధి చేయవచ్చో చేసి చూపించారు అని అన్నారు ఆయన. దేశంలోని మిగితా 26, 27 రాష్ట్రాల్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ సంస్థ ఇచ్చిన ర్యాంకు 101, ఇది సిగ్గు చేటుకాదా అని నిలదీశారు. 75 సంవత్సరాలలో  కాంగ్రెస్ బిజెపి లు ఏం పీకినట్టు అని ప్రశ్నించారు. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్నారు ఆయన. మోడి కొంటా అంటే, కెసిఆర్ కొనడం లేదా అని నిలదీశారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు అభూత కల్పన చేసేవారు వాళ్ళు అని ఆరోపించారు. ధాన్యం సేకరణ కేంద్రం బాధ్యత అని అంబేద్కర్ కేంద్రంపై పెడుతూ రాజ్యాంగం లో పొందుపరిచారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: