చంద్రబాబు పాలనపై కేటిఆర్ హాట్ కామెంట్స్...

Gullapally Rajesh
సిరిసిల్ల మహాధర్నాలో మంత్రి కేటిఆర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. రైతుల ధర్నాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమం గుర్తుకు వస్తుందని అన్నారు. అనాటి ఉద్యమంలో కేసీఆర్ కృషి యాది కొచ్చిందీ అని చెప్పుకొచ్చిన ఆయన... ఇప్పుడు ఎందుకు మనకు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరాల్లో కేసీఆర్ రైతుకు పెద్ద పీఠ వేసారని ఆయన గుర్తు చేసారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రైతు వ్యతిరేక నిర్ణయాలు కేసీఆర్ తుడిచి పెట్టారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతు దుస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు.
సమైక్య రాష్ట్రంలో  ఎరువులకోసం లైన్లు..కరెంటు కోతలతో అల్లాడేవారమని అన్నారు. రైతుబాంధవులు అని చెప్పుకున్నోల్లు కూడా ఆరు గంటల కరెంటును.. కోతలు లేకుండ ఇవ్వలేదు అని ఆరోపణలు చేసారు. ఐదు ఆరు వందల ఫీట్లువరకు బోర్లు వేసేవారమని సమైక్య రాష్ట్రం  చెరువులు ఎండిపోతుంటే చూసారు తప్ప బాగుచేయలే అని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు దేశంలో నెంబర్ వన్లో ఉండే పరిస్థితి ఉందని అన్నారు. ఏడు దశాబ్దాల పాలనలో ఎవరు చేయని విధంగా కేసీఆర్ వచ్చిన కొత్తలోనే 24గంటలు కరెంటు ఇచ్చారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.
పరోక్షంగా చంద్రబాబు పాలనను ప్రస్తావిస్తూ గతంలో ఓ సీఎం కాలంలో ఏడెండ్లు కరువు ఉంటే మంచి మనసున్న మన సీఎం కేసీఆర్ పాలనలో ప్రకృతి కూడా సహకరించింది అని వ్యాఖ్యానించారు. విత్తనాలకోసం ఎరువుల కోసం యుధ్ధాలు లేవు ప్రణాళిక బద్దంగా ముందుకు పోయాము అన్నారు ఆయన. 20 వేల కోట్ల ఖర్చుపెట్టి మిషన్ కాకతీయతో చెరువులు కుంటల బతికించుకున్నామని అన్నారు. 70 ఏండ్ల స్వాతంత్య్రంలో రైతుల కోసం ఎవరి రాని ఆలోచనలతో రైతు బుుణ మాఫీ , రైతు బంధు ప్రకటించిన నేత కేసీఆర్ అని కొనియాడారు. మన రైతు బంధు పథకాన్ని ఆనేక రాష్ట్రాలు కాపి కొడుతున్నాయి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: