బండి సంజయ్ ని భయపెడుతున్న కేసీఆర్?

Santhi Kala
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాస్త ఒత్తిడికి గురవుతున్నారు అనే ప్రచారం బీజేపీ వర్గాలు ఎక్కువగా జరుగుతోంది. బిజెపి లో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు ఆయనకు పూర్తి స్థాయి లో సహకారం అందించడం లేదని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. సీఎం కేసీఆర్ పై ఆయన విమర్శలు చేయడం ఆ తర్వాత సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి సంజయ్ టార్గెట్గా చేసుకుని ఆరోపణలు చేయడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వీటికి బండి సంజయ్ నుంచి సమాధానం వస్తున్న సరే కొంతమంది కీలక నాయకులు మాట్లాడటం లేదు.
కిషన్ రెడ్డి మాట్లాడిన సరే కేవలం తనపై చేసిన విమర్శలను మాత్రమే సమాధానం ఇచ్చారు గాని బండి సంజయ్ పై చేసిన విమర్శలు ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదు. అలాగే బీజేపీ కీలక నాయకులుగా ఉన్న వారు కూడా పెద్దగా బండి సంజయ్ కు మద్దతుగా వచ్చిన పరిస్థితి కనబడలేదు. విజయశాంతి డీకే అరుణ లాంటి వాళ్ళు మీడియాతో మాట్లాడిన సరే ఆ వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపించ లేదు.
బండి సంజయ్ పై టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు విమర్శలు చేస్తున్న బిజెపి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడం వెనక కారణం ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ లో ఉన్న కొంతమంది కీలక నాయకులు టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వటం లేదని అంటున్నారు. అయితే బండి సంజయ్ పార్టీలో కీలకమనే భావంతో ఉన్నారని అందుకే చాలామంది నాయకులు ఆయనకు సహకారం అందించడం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే కొంతమంది నాయకుల పై కేంద్ర నాయకత్వానికి కూడా బండి సంజయ్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: