ఆ పల్లె... ఇద్దరు సి.ఎంలు సమావేశం అయ్యోలా చేసింది.


ఓ చిన్న ప్రాంతం.  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మావేశం అయ్యోలా  చేసింది. ఇది ఎవరు అవునన్నా... కాదన్నా.. అంగీకరించాల్సిన విషయం. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో చాలా విషయాలు చర్చకు వచ్చి ఉండవచ్చు.   అంజెండాలో ఆ ప్రాంతం  మొదటి అంశంగా ఉండక పోవచ్చు. కానీ చర్చల్లో మాత్రం ప్రధాన భూమిక  పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా ?


కొఠియా. ఇది ఆంద్ర ప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల మధ్య నున్న ప్రాంతం. ఒకప్పుడు అది చాలా చిన్న గ్రామం. ఈ ప్రాంతం  ఆగస్టులో భారత దేశం దృష్టిని ఆకర్షించింది.  కారణం తెలుసా ? అధికార పార్టీలో ఉన్న పవర్ ఫుల్ ఎం.ఎల్ ఏ ను ఈ ప్రాంత ప్రజలు నిర్భందించారు. సాలూరు నియోజక వర్గం నుంచి హ్యాట్రిక్ సాధించిన శాసన సభ్యుడు పీడక రాజన్నదొర. ఆయన ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ కూడా. ఈయనను కోఠియా ప్రాంత ప్రజలు నిర్భందించి, తమ నిరనను  యావత్ దేశానికి వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడి స్థానికులకు నచ్చజెప్పి  రాజన్న దొరను  తిరిగి తీసుకువచ్చారు.
కొఠియా గ్రామ పరిసరాలు  గిరిజనులకు ఆవాస ప్రాంతాలు. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న అమాయకపు జీవులు. అయితే వారిలో పట్టుదల, పౌరుషం చాలా ఎక్కువ.  కాలాను గుణంగా  దేశ జనాభా పెరుగుతున్నట్లే కొఠియా ప్రాంతంలో నూ జనాభా పెరిగింది. దీంతో గ్రామ పరిసరాల విస్తీర్ణం పెరిగింది. గతంలో ఒకటిగా ఉన్న గ్రామం పెరిగి పెరిగి 21 గ్రామాలుగా మారింది. అయితే వారందరికీ ఒకే మాట. ఒకే కట్టుబాటు. వీరికి రెండు రాష్ట్రాల రెవిన్యూ సరిహద్దులు తెలియవు. దీంతో సరిహద్దు సమస్య ఏర్పడింది.   ఈ  ప్రాంతంలో  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం రెండూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయి. వారందరికీ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాయి. అయితే  ఆ ప్రాంత ప్రజలు తాము ఒడిశాకు  చెందిన వారమని చెపుతారు.  అధికారులు మాత్రం మీరు  ఆంధ్ర ప్రదేశ్ భూ భాగంలో ఉన్నందున మీరంతా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారు అని పేర్కోంటారు. దీంతో  వివాదం మొదలైంది.  చాలా కాలంగా ఈ  సమస్య పరిష్కారం కాకుండా ఉంది. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లు  సమావేశం అయ్యారు. ఈ సమస్యను చర్చించారు.   రెండు రాష్ట్రాల అధికారులతో  ఏర్పాటయ్యే కమిటీ  ఈ సమస్యను  తొలి ప్రాధాన్యతగా తీసుకుంటుందని  ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం తరువాత  ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: