కేటిఆర్ ఫోకస్ ఆన్ సోషల్ మీడియా...?

Gullapally Rajesh
తెలంగాణాలో బిజెపి నేతలు వర్సెస్ అధికార పార్టీగా రాజకీయం వేగంగా మారుతున్నది. తెలంగాణాలో బిజెపిని లక్ష్యంగా చేసుకుని సిఎం కేసీఆర్ విమర్శలు మొదలుపెట్టిన తర్వాత బిజెపి కూడా ఘాటుగా విమర్శలు చేస్తుంది. నేడు మంత్రి కేటిఆర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన సంస్కరణలు సంక్షేమ, అభివృద్ధి పనుల్లో తెలంగాణ ముందంజలో ఉంది అని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులు బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని నిలదీశారు. కేసీఆర్ ప్రజా నాయకులు అని ఆయన స్పష్టం చేసారు.
కాంగ్రెస్ బీజేపీ టిడిపి వంటి ప్రధాన పార్టీలను గట్టిగా ఎదుర్కొన్న ఘనత ఆయనది అని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా  కేసీఆర్ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. 60 ఏళ్లపాలనలో ఎం చేశారు అని నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు కరెంట్ షాక్ లు రైతు ఆత్మహత్యలు ఉండేవి అని ఆయన వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తరలిస్తాం అని మంత్రి స్పష్టం చేసారు.
ఆసరా పింఛన్లు 10 రేట్లు పెంచాం అని అన్నారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళకు దేశంలోనే తొలిసారిగా పింఛన్లు ఇస్తున్నాం అని మంత్రి తెలిపారు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు బీజేపీ నేతలు నీళ్లు నములుతున్నారు అని ఒక్కరు కూడా సమాధానం ఇవ్వడం లేదు అని ఎద్దేవా చేసారు. పాదయాత్ర చేస్తుంటే తెలంగాణ అభివృద్ధికి  బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్ అనిపిస్తోంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోంది అన్నారు మంత్రి. వరిధాన్యం కొనలేమని రాష్ట్రాలకు  కేంద్రం లేఖ రాసింది అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రమే వరి కొనుగోలు చేయాలంటూ ఈ నెల 12 న ఆందోళనలు నిర్వహించాలి అని కోరారు. కేంద్రం మేడలు వంచే విధంగా సోషల్ మీడియాలో కార్యకర్తలు పని చేయాలని మంత్రి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: