పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరికినట్టేనా..?

NAGARJUNA NAKKA
తెలంగాణ రాష్ట్రంలో పోడు భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం.. అర్హత కలిగిన గిరిజనుల సమస్యలను వీలైనంత తీర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రామసభలు సబ్ డివిజనల్, జిల్లా కమిటీల ఆమోదానికి మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో పోడు భూముల సమస్య 2వేల 450గిరిజన గ్రామాల్లో ఉన్నట్టు ప్రభుత్వం అంచనాకు వచ్చింది.
గ్రామ కమిటీల ఆధ్వర్యంలో పోడు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. పరిశీలన తర్వాత గ్రామసభలు తీర్మానాలు చేస్తాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన వివరాలను సభలో ప్రకటించాలి. ఈ తీర్మానాలను, దరఖాస్తులను గ్రామ కార్యదర్శి 3రోజుల్లో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. ఇందుకు మూడు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక మీ సేవా కేంద్రాన్ని గుర్తించాలి. పోడు భూముల పరిష్కారానికి విధివిధానాలు ఇలా రూపొందాయి.
ఇక అధికారులు పోడు భూముల పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హక్కు పత్రాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని సిరిసిల్లలో జరిగిన పోడు భూముల అవగాహన సదస్సులో అన్నారు. అటవీ భూములు ఆక్రమించకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని.. దరఖాస్తు చేసుకున్న పోడు రైతుల అర్జీలను పరిశీలించి. లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ పోడు భూముల రైతులు చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. పోడు భూముల్లో తాము వ్యవసాయం కొనసాగిస్తుంటే.. అటవీ శాఖ అధికారులు అడ్డుపడటం వివాదాలకు దారితీసింది. ఇలా ఒక్క చోటే కాదు.. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి తంతే జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుండటంతో పోడు భూముల సమస్యలకు పరిష్కారం దొరికేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: