హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

Chandrasekhar Reddy
కేసీఆర్ తాజాగా మీడియా ముందుకు వచ్చి నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ పై యుద్ధం ప్రకటించాడు. అంతటితో ఆగేది లేదని స్పష్టం కూడా చేశారు. అయితే ఇవన్నీ కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక లో ఓడిపోయిన విషయం దారిమళ్లించడానికే అన్నట్టు ఉన్నాయి. ఆ బాధను అంతా మరిచిపోవడానికి తిట్లదండకం వదిలాడని మరి కొందరు అంటున్నారు. ఇంతకు ఈ యుద్ధం మొదలు అయినట్టేనా, తిట్టేసి మనసులో అంతా పక్కన పడేశాడు కాబట్టి విషయం కూడా పక్కకు పెట్టేసినట్టేనా అనేది భవిష్యత్తు తేల్చనుంది. బీజేపీ యందు తెరాస తన తీరు మార్చుకుంది, గతంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మరి వారికి సాగిలపడేవాడు నేడు ఇలా రూటు మార్చడంటే వెనుక కారణాలు ఏమిటో కానీ తాజా తిరుగుబాటు మాత్రం శాశ్వతం అనే తెలుస్తుంది.
మొత్తానికి తెలంగాణాలో కేసీఆర్ కు చెమటలు పట్టించే ప్రతిపక్షం తయారైంది. అందుకే దానిని కూడా బహుశా ఆయన భరించలేక ఇలా తిట్లతో వెళ్లబుచ్చుకున్నాడు కావచ్చు. ఎన్ని చేసినా ఇన్నాళ్లు అధికారం ఉంది కదా అని విశ్రాంతి తీసుకున్న ఆయనకు నేడు ప్రతిక్షణం పని పెట్టె ప్రతిపక్షం దొరకడంతో కాస్త కొత్తగా ఉండొచ్చు. ఎలా ఉన్న ప్రతిపక్షాన్ని గుర్తించక తప్పదు, అది వేలు చూపించకుండా ప్రజాసేవ చేయడం అంత సులభం కూడా కాదు. వీలైతే ఆ స్థాయిలో సేవ ప్రారంభిస్తే అప్పుడు ఏమైనా ఫలితాలు ఆశించవచ్చు. అప్పటి వరకు ఇలాంటి ఎన్ని మీటింగ్ లు పెట్టి ఎంత ఛండాలంగా తిట్టినా అది కూడా ప్రతిపక్షానికే కలిసివస్తుంది తప్ప మరో లాభం ఏమి ఉండదు.
ఇదంతా కేసీఆర్ అర్ధం చేసుకునే లోపే, అసలే ముందస్తు ఎన్నికలు అంటుంది బీజేపీ, ఆ కాస్తా గెలుపు బీజేపీ సొంతం చేసుకునేట్టుగానే ఉంది. ఈ విషయం ముందు ఆయన తెలుసుకుంటే, త్వరగా ప్రజలలో మళ్ళీ కాస్త అనుకూల అభిప్రాయాన్ని గెలుచుకుంటే అప్పుడు వాళ్ళే బీజేపీ ని పక్కన పెడతారు. కేసీఆర్ లేదా తెరాస మాత్రం ఎన్ని చేసినా, ప్రజా సేవ ఈ కాస్త సమయంలో చేయకపోతే ఫలితం బీజేపీకే వస్తుంది. అంత అవకాశం కేసీఆర్ ఇస్తాడా అనేది చూడాల్సి ఉంది. కేటీఆర్ ఆశలు అడియాశలుగానే మిగిలిపోతాయి. దానితో అతడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకం అవవచ్చు. అంటే పార్టీకి వ్యతిరేకం కాకపోవచ్చు, ఇంటి వరకు అవన్నీ జరిగితీరుతాయి. ఇవన్నీ కేసీఆర్ ఎదురుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే ప్రజా సేవే మేలు అని ఆయనకు అర్ధం అవుతుందా అనేది కూడా సందేహమే, చూద్దాం ఏమి జరగబోతుంది అనేది!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: