కాంగ్రెస్:వచ్చే ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు.. ఇందుకేనా..?

MOHAN BABU
  భారతదేశంలో నిచ్చెన మెట్ల అంతరాలతో కూడుకున్న కుల వ్యవస్థ వలన తరతరాలుగా వివక్షత అసమానతలు, ఆధిపత్య భావజాలం, సమాజం అంతటా విస్తృతంగా అల్లుకుని ఉన్నది. సౌలభ్యం కోసం ఆయా సామాజిక వర్గాల సామాజిక స్థితిగతులను అంచనా వేయడం కోసం ఎస్సీ, ఎస్టీ ,బిసి, ఓసి ,మైనారిటీ అనే వర్గాలుగా విభజన చేయడం జరిగినది. సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, సామాజిక స్థితిగతులు కాకుండా ఆర్థిక పరిస్థితులు, అనాదిగా ఎదుర్కొన్న వివక్షతల ఆధారంగా కూడా సామాజిక వర్గాల నిర్ణయం జరిగింది. అయితే అది భారతదేశంలో బలమైన కుల ప్రచారానికి హెచ్చుతగ్గుల భావజాలానికి దోహదపడి అంతరాలు మరింతగా పెరిగినవి.
      బీసీ వర్గాలు సామాజిక సమీకరణ:-
 
      వెనుకబడిన తరగతులలుగా రాష్ట్రాలలో ,దేశవ్యాప్తంగా ఓ బీసీలుగా గుర్తించబడిన టువంటి వర్గాలు సమాజములో 52 శాతం ఉన్నట్లుగా అనేక సంవత్సరాలుగా ప్రచారం లోనే ఉంది. కానీ సరైనటువంటి బీసీ జనగణన  జరగలేదు. 2021లోనైనాజనాభాగణంలో బీసీ గణన జరగాలని బీసీలు వివిధ రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్నవి. అంచనాగా ఉన్నటువంటి ఆ 52% కైనా దేశవ్యాప్తంగా సరైన ప్రాతినిధ్యం లేని కారణంగా చట్టసభలలో కానీ, పార్టీలలో గాని, ఉద్యోగ విద్యా రంగంలో కూడా ఆ స్థాయిలో బీసీ వర్గాలకు ప్రయోజనం దక్కడం లేదు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు వారి జనాభా దామాషాలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటే బీసీ వర్గాలకు మాత్రం 52 శాతానికి గానూ 27 శాతానికి చట్టబద్ధత కల్పించడం మెజారిటీ సామాజికవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే అవుతుంది.
     ఎందుకు ఇలా జరిగింది..?
    రాజ్యాంగ రచనా కాలం లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రత్యేక అధికరణముల ద్వారా రిజర్వేషన్ సౌకర్యం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో కల్పించబడిన ప్పటికీ బీసీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి పూనుకున్నప్పుడు అగ్రవర్ణాలు అడ్డుకోవడంతో అసలు సమస్య తలెత్తింది.
 తర్వాత బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయాన్ని రాష్ట్రపతి గారి ఉత్తర్వుల మేరకు ఏర్పడే కమిటీ ద్వారా నిర్ణయించడానికి ఒక ముగింపుకు రావడంతో రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పటికీ బీసీల రిజర్వేషన్ అమలు కాలేదు. ఆనాడే బీసీల రిజర్వేషన్ సౌకర్యానికి గండి పడటంతో ఇప్పటికీ ఆ లోటును పూర్తి చేయ లేక పోతున్నాం.
 తర్వాత కమిటీ నివేదిక ఇచ్చినా కూడా అమలు చేయలేదు. కానీ ఆ తర్వాత నియమించబడిన టువంటి మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం గా వి.పి.సింగ్ నాయకత్వంలో బీఎస్పీ వంటి మిగతా రాజకీయ పార్టీల ఒత్తిడి సూచన మేరకు ఓ బి సి ల రిజర్వేషన్లను వి.పి.సింగ్ సాధించి బీసీల పక్షపాతిగా మిగిలిపోయాడు. అయిన మొత్తం రిజర్వేషన్ల శాతం 50 కి మించకూడదు అనే సుప్రీంకోర్టు నిబంధన మేరకు 52 శాతం ఉన్న బీసీలకు 27 శాతానికి కుదించడం అనేది ఇప్పటికీ బీసీ వర్గాలను కలచివేస్తున్న సమస్య. ఆ 27 శాతం లో కూడా చట్టసభలకు సంబంధించి కనీసం పది శాతం కూడా అమలు కాకపోవడం పాలకులకు రాజకీయ పార్టీల నాయకులకు బీసీల పట్ల ఉన్న కపట ప్రేమను అర్థం చేసుకోవచ్చు. బీసీ వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకు గానే భావించి రాజ్యాధికారానికి దూరంగా ఉంచే కుట్ర చేస్తున్న ఉన్నత వర్గాల, మిగతా పాలకులను మట్టికరిపించి చాలంటే బీసీ వర్గం సోయితో తో కళ్ళు తెరుచుకొని తమ ఓట్లను తమకే వేసుకోవడం ద్వారా చట్టసభల్లో రాజ్యాధికారం దిశగా పయనించ వలసిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బీసీల గురించి ఆలోచిస్తారని లేకుంటే రాజకీయ పతనం తప్పదని బీసీలు గుర్తించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: