లక్షలాది మందితో ట్యాంక్ బండ్ ను దిగ్బంధిస్తాం !

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు.  తమ సహనాన్ని పిరికి తనంగా కేసీఆర్ భావించారు... 30 న పోలింగ్ రోజు బీజేపీ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసారని స్పష్టం చేశారు  బండి సంజయ్. టీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే దేశం లో ఎటువంటి పరిణామాలు ఉత్పన్నం అవుతాయోనని అందరూ టెన్షన్ పడ్డారు..  ఓటుకు 6 వేల నుండి 20 వేల వరకు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్.  Trs గెలిస్తే చాలా మంది రాజకీయాలు వదిలి వెళ్లి పోయేవారు. 

డబ్బుల ద్వారానే గెలవాలని అనుకున్న పార్టీ లకి హుజూరాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు బండి సంజయ్.  Trs గెలుస్తుంది అని సీఎం తప్పుడు ప్రచారం చేశారు.. రెండు మూడు బై ఎలక్షన్స్ వస్తున్నాయని సీఎం అంటున్నారు అంట అని ఎద్దేవా చేశారు బండి సంజయ్.  ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన గెలిచేది బీజేపీ నే  నని.. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించింది... 41 రూపాయలు దొబ్బి పోతున్నావని హుజూరాబాద్ ప్రజలు గ్రహించారు.. ఓడించారు... ఇప్పటికైన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.  

దళిత బంధు ను అమలు చేయాల్సిందే... దళిత బంధు అమలు చేయాలని ఈ నెల 9 న హైదరాబాద్ లో డప్పుల మోత కార్యక్రమం ఉంటుందని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తావా ఇవ్వవ సీఎం స్పష్టం చేయాలి... ఉద్యోగ నోటిఫికేషన్స్, నిరుద్యోగ భృతి కోసమన్నారు బండి సంజయ్.  ఈ నెల 16 న లక్షలాది మంది తో ట్యాంక్ బండ్ ను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలవడం తో  T rs వాళ్ళు కూడా సంతోష పడుతున్నారని ఎద్దేవా చేశా రు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: