వరినే పండించండి : బండి సంజ‌య్‌

Paloji Vinay
యాసంగిలో వరి పంట‌ మాత్రమే పండించాలని రైతులకు తెలంగాణ రాష్ట్ర‌ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యాన్ని కొనిచ్చే బాధ్యతను బీజేపీ తీసుకుంటోంది అని హామీ ఇచ్చారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించి, టీఆర్ఎస్‌ను ఓడించి హుజురాబాద్ ప్రజలు ఉద్యమస్ఫూర్తిని చాటారంటూ పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించిన వేళ వెంటనే పెట్రోల్, డీజిల్ ధరను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

దళితబంధు పథకం అమలు కోసం బీజేపీ పోరాటానికి సిద్ధమవుతోంది తెలిపారు బండి సంజ‌య్. ద‌ళితబంధు పై సమాజం చైతన్యమైతే ఏమవుతోందో హుజూరాబాద్ లో కేసీఆర్ చూశాడు అని పేర్కొన్నారు. వెంట‌నే ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. ద‌ళిత‌బంధు అములు చేయ‌క‌పోతే ఈనెల 9 వ తేదిన డ‌ప్పులు మోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు .. నిరుద్యోగభృతి వెంట‌నే అమలు చేయాల్సిందే అని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.  టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే నిరుద్యోగ మిలియన్ మార్చ్ ను‌ అడ్డుకోవాలి బండి సంజ‌య్ స‌వాల్ విసిరారు. ఈటల రాజేంద‌ర్ గెలుపుతో కేసీఆర్ కళ్ళు కిందికి దిగాయని టీఆర్ఎస్ నేతలు సైతం సంతోషిస్తున్నారు అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

  యువత రాజకీయాల్లోకి రావటానికి హుజురాబాద్ ప్రజలు మార్గనిర్దేశం చేశారు అని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. గెలిచేది బీజేపీ మాత్రమే అంటూ ధీమా వ్య‌క్తం చేశారు బండి సంజ‌య్‌. సీఎం‌ కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుంది అని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, హుజురాబాద్ ఉప ఎన్నిక‌ సంద‌ర్భంలో బీజేపీకి జితేందర్ రెడ్డి లక్కీ హ్యాండ్ గా మారారు అని జితేంద‌ర్ రెడ్డిని పొగిడారు. కేసీఆర్ మెడలు వంచి ఆయన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: