అంబ‌టి రాంబాబు సీటు మార్చేస్తోన్న జ‌గ‌న్‌.. అక్క‌డ నుంచి పోటీ...!

VUYYURU SUBHASH
2024 ఎన్నిక‌ల్లో  ఎలాగైనా విజ‌యం సాధించి వ‌రుస‌గా రెండో సారి అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం జ‌గ‌న్ కు కీల‌కం. అందుకే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సారి భారీగా మార్పులు ఉంటాయ‌ని అంటున్నారు. ఇక కొంద‌రు పార్టీ నేత‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌స్తే.. అప్పుడు వారిని నియోజ‌క‌వ‌ర్గం మార్పించి పోటీ చేయించే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ట‌.

వైసీపీ సీనియ‌ర్ నేత అంబ‌టి రాంబాబు గ‌త రెండు ఎన్నిక‌ల్లో నూ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి  నుంచి పోటీ చేస్తూ వ‌స్తున్నారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌త్తెన‌ప‌ల్లిలో కేవ‌లం 713 ఓట్ల తో ఓడిపోయారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో అదే కోడెల శివ ప్ర‌సాద్ రావుపై 19 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న విజ‌యం సాధించారు. అయితే ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి వైసీపీ కేడ‌ర్ లో అంబ‌టి పై తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే ఈ సారి అంబ‌టిని అక్క‌డ నుంచి మార్పించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రేప‌ల్లె నుంచి పోటీ చేయిస్తే ఎలా ?  ఉంటుంద‌ని జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. రేపల్లెలో వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి కూడా గెల‌వ‌లేదు.. అక్క‌డ నుంచి గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేగా అనగాని సత్యప్రసాద్ గెలిచి హ్యాట్రిక్ కోసం కాచుకుని ఉన్నారు. అయితే ఇదే రేప‌ల్లె నుంచి 1989లో అంబటి రాంబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న‌కు అక్క‌డ మంచి ప‌ట్టు ఉంది.

పైగా అంబ‌టి సొంత నియోజ‌క‌వ‌ర్గం రేప‌ల్లె. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన‌గానిని ఓడించేందుకు మోపిదేవి కూడా లేరు. ఆయ‌న రాజ్య‌స‌భ‌కు వెళ్లారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంబ‌టిని రేప‌ల్లె బ‌రిలోకి దించే క‌స‌ర‌త్తులే జ‌గ‌న్ చేస్తున్నార‌ట‌. ఇక స‌త్తెన‌ప‌ల్లి సీటును ఈ సారి క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారికి ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: