రోమ్ జీ-20 సమావేశానికి మోడీ.. లక్ష్యం ఏంటి..?

MOHAN BABU
ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా జీ -20 కూటమి అంతర్జాతీయ వేదికపై కీలక భూమిక పోషిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 20 మందికి పైగా ముఖ్య దేశాధినేతలు పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి దాటికి ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో ఇటలీ రాజధాని రోమ్ వేదికగా జరగనున్న జి-20 శిఖరాగ్ర సదస్సుకు విశేష  ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. వీరితో పాటు పలు అంతర్జాతీయ వేదికల ప్రతినిధులు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల అధినేతలు, సీనియర్ మంత్రులు పాల్గొంటున్నారు.

ఏడాది సంవరనానికి  పీపుల్, ప్లానెట్, ప్రాస్పిరిటీ, ట్రిపుల్ పి అన్న నినాదాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడం,భూతాపాన్ని నివారించే మార్గాలను అన్వేషించడం, విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ ఐక్యంగా ముందడుగు వేయాలి అన్నది ఇందులోని ముఖ్య ఉద్దేశం. 19 దేశాలకు తోడుగా ఐరోపా యూనియన్ తో కలిసి జి-20 గా అవతరించింది. జనాభా పరంగా 70 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో సింహభాగం ఈ దేశాలదే. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం ఈ దేశాల మధ్య జరుగుతుంది. ఏటా ఒక్కో దేశ అధ్యక్ష స్థానంలో ఉండి, శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ . గత ఏడాది సౌదీ రాజధాని  రియాబ్ లో అగ్రనేతలు బేటీ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వర్చువల్ ప్రసంగాలకే పరిమితమయ్యారు. ఈ దఫా ఇటలీ ఆతిథ్యం ఇస్తుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. కొన్ని కారణాలతో రష్యా,చైనాఈ సదస్సుకు హాజరు కాలేదు.

ఇతర ముఖ్య దేశాలైన బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, అర్జెంటీనా, ఇండోనేషియా,మెక్సికో,టర్కీ, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా,బ్రెజిల్, సౌదీ అరేబియా తదితర దేశాల అధినేతలు స్వయంగా పాల్గొన్నారు. ఐరోపా యూనియన్,ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఓప్పెట్, ఏషియన్ తదితర కూటమిల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా కాంగో, నెదర్లాండ్స్, సింగపూర్, రువాంటా, స్పెయిన్ దేశాధినేతలకు ఆతిధ్యం లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: