బందరులో తమ్ముళ్ళ దూకుడు... కానీ కొడాలితో కష్టమే?

M N Amaleswara rao
కృష్ణా జిల్లాపై తెలుగుదేశం పార్టీకి మొదట నుంచి మంచి పట్టున్న విషయం తెలిసిందే. జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాలు టీడీపీకి అనుకూలంగా ఉండేవి...అయితే గత ఎన్నికల్లోనే కాస్త సీన్ మారింది....జిల్లాలో పూర్తిగా వైసీపీ డామినేట్ చేసింది...16 స్థానాలకు 14 సీట్లు గెలుచుకుంది..అటు ఒక ఎంపీ సీటు కైవసం చేసుకుంది...టీడీపీ ఏమో 2 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. ఇక టీడీపీ తరుపున గెలిచిన వంశీ, వైసీపీ వైపుకు వెళ్ళడంతో జిల్లాలో టీడీపీకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ మిగిలారు.
అయితే ఎన్నికలై రెండున్నర ఏళ్ళు కావొస్తుంది....దీంతో జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బందరు(మచిలీపట్నం) పార్లమెంట్ స్థానంలో కాస్త పరిస్తితి మారుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో గన్నవరం సీటు తప్ప మిగిలిన సీట్లని వైసీపీ గెలుచుకుంది. ఇక గుడివాడ, పామర్రు, పెనమలూరు, పెడన, బందరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఇక గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీకి వెళ్ళడంతో బందరులో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బందరు ఎంపీ ఎలాగో వైసీపీ ఖాతాలోనే ఉంది.
అయితే ఇప్పుడుప్పుడే బందరులో టీడీపీ...వైసీపీకి పోటీ ఇచ్చే దిశగా ముందుకెళుతుంది. బందరు, పామర్రు, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల్లో టీడీపీ కాస్త పికప్ అయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా బందరులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దూకుడుగా ఉన్నారు. అటు పెనమలూరులో బోడే ప్రసాద్, పామర్రులో వర్ల కుమార్ రాజాలు సైతం బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నారు. పెడనలో కాగిత కృష్ణప్రసాద్ సైతం ప్రజల్లోకి వెళుతున్నారు.
కానీ బందరు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లోనే టీడీపీ పరిస్తితి దారుణంగా ఉంది. గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ హవా పూర్తిగా ఉంది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఏ మాత్రం పుంజుకున్నట్లు కనిపించడం లేదు. మొత్తానికి కొడాలి, వంశీలు టీడీపీ పరిస్తితిని రివర్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: