బ్రెజిల్ : అధ్యక్షుడిపై.. కేసులు.. !

Chandrasekhar Reddy
కరోనా సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోని దానినుండి తమను రక్షించడంలో విఫలం అయ్యాడని తమ అధ్యక్షుడి(జైర్ బొల్సో నారో)పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని అక్కడి సెనేటర్లు తాజా ఓటింగ్ లో పేర్కొన్నారు. ఈ మహమ్మారి వలన ఇప్పటికే అక్కడ ఆరు లక్షల మంది మరణించిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాన్ని సెనేటర్ల కమిటీ తీసుకుంది. కేవలం అధ్యక్షుడి నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఇంతమంది మనుషులు మరణించాల్సి వచ్చిందని కూడా ఈ అభియోగంలో పొందుపరిచారు. ఈ అభియోగ పత్రాలను అధ్యక్షుడు నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్ కు సెనేట్ కమిటీ సభ్యులు ఇచ్చారు.
బొల్సో మాత్రం తాను తెలిసి ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చాడు. ఆయన ఎంత చెప్పినా కరోనా సమయంలో ప్రజలకు ధైర్యంగా ఉండాలని చెప్పడంలో విఫలం అయ్యాడని స్పష్టం అవుతుంది. అమెరికా తరువాత స్థానంలో ఉన్న బ్రెజిల్ లో జనాభా 20.8 కోట్లు ఉన్నారు, అందులో కరోనా కారణంగానే 606000 మంది మరణించగా, 2.17 కోట్లమందికి వైరస్ సోకిందని నివేదికలు చెపుతున్నాయి. ఈ నివేదికలను మొదట ప్రాసిక్యూటర్ జనరల్ అగస్టో అరస్ అధ్యయనం చేసి అనంతరం అధ్యక్షుడిపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నాయి. అయితే అరస్ అధ్యక్షుడికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది.
బ్రెజిల్ లో కరోనా విస్తరించడం వలన హెర్డ్ ఇమ్మ్యూనిటి సాధిస్తాం అంటూ ఆశపడ్డా అది నెరవేరకపోగా, బాధితుల సంఖ్య తీవ్రం అయిపోయింది. ఇదే అందరి దృష్టిలో అధ్యక్షుడి పై విమర్శలకు కారణంగా ఉంది.  ప్రకారం, కరోనా సమయంలో పరిస్థితులకు అధ్యక్షుడే కారణం అని తెలుస్తుంది. అప్పట్లో నిధుల దుర్వినియోగం, అలాగే కరోనా వ్యాప్తిపై తప్పుడు ప్రచారం లాంటివి ఆయన చేయించారని ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. అందుకే అధ్యక్షుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయాలని సెనేటర్లు కోరుతున్నారు. అయితే ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలుగా అధ్యక్షుడి కొడుకు అంటున్నారు. ఒక ప్రకృతి విలయాన్ని అధ్యక్షుడికి అంటగట్టడం చట్టపరంగా కూడా ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: